
మాజీ మంత్రి రజినిపై పోలీసుల చర్య హేయం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: కూటమి పాలనలో అంతా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కోర్టులు ఎన్ని మొట్టికాయులు పెడుతున్నా పోలీసులు అత్యుత్సాహానికి పోయి ఇష్టానుసారం వ్యవహరించడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీసీ నేత, మహిళా నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజినిపై చిలకలూరిపేట సీఐ సుబ్బనాయుడు ప్రవర్తన హేయమైన చర్య అని అన్నారు. ఒక మహిళపై ఇలా దురుసుగా ప్రవర్తించడం దారణమని పేర్కొన్నారు. మాజీ మంత్రిని ఇలా పక్కను నెట్టడం, ఆమైపె దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. అలాగే గుంటూరు జిల్లా కంతేరులో కూడా ఎంపీటీసీ అయిన దళిత మహిళ కల్పనను రాత్రి 3 గంటలకు అరెస్టు చేయడం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమన్నారు. ఈ అన్యాయాలపై పోరాటం చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రజలకు అండగా ఉంటుందన్నారు.