
అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
నందిగాం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జవాన్ పిన్నింటి దొరబాబు అంత్యక్రియలు స్వగ్రామం పెంటూరులో పోలీస్ లాంఛనాలతో మధ్య ముగిశాయి. మంగళవారం సాయంత్రం నరసన్నపేట వద్ద జాతీయ రహదారి వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దొరబాబు మృతి చెందిన విషయం విదితమే. బుధవారం నరసన్నపేటలో పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి చేరుకున్న దొరబాబు మృతదేహానికి కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి సదానందం తలకొరివి పెట్టగా పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం భార్య కాంచనకు జాతీయ పతాకం అందజేశారు.