
మేం అచ్చెన్నాయుడు మనుషులం..
నరసన్నపేట: స్థానిక ఇందిరా నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ పనులు అందరినీ విస్మయపరుస్తున్నాయి. నిబంధనల మేరకు ఇక్కడ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరగకూడదు. ఎలాంటి వాణిజ్యపరమైన నిర్మాణమూ చేపట్టకూడదు. కానీ విజయనగరానికి చెందిన ఓ బిల్డర్ ఈ పనులు చేపడుతున్నారు. స్థానిక సొసైటీ పాలక వర్గం సభ్యులు ప్రశ్నిస్తుంటే..‘మేం మంత్రి అచ్చెన్నాయుడు మనుషులం.. మా వెనుక ఆయన ఉన్నారు’ అని బెదిరిస్తున్నా రు. మెయిన్ రోడ్డుకు సమీపంలో గొట్టిపల్లి రెవెన్యూ పరిధిలో ని సర్వే నంబర్ 204–1లో 1244 చదరపు అడుగుల్లో (26 సెంట్లు) అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతోంది.
1948లో ఇందిరానగర్‌లో హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఏర్పడింది. కో ఆపరేటివ్ నిబంధనల ప్రకారం ఇది నడుస్తోంది. ఇక్కడ స్థలం పొందిన వారికి ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. సామూహిక గృహాలు వంటి వాణిజ్యపరమైన నిర్మాణాలు చేయడానికి అనుమతులు లేవు. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా ఇక్కడ అపార్ట్‌మెంట్ నిర్మాణం చేస్తున్నారు. సొసైటీ నుంచి ఎన్‌ఓ సీ తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదు. స్థలాన్ని ఇతరులకు మార్ట్‌గేజ్ చేయకూడదని నిబంధనలు చెబుతున్నా.. దాన్ని కూడా అతిక్రమించి మార్ట్‌గేజ్ చేశారు.
అక్రమంగా రిజిస్ట్రేషన్..
ప్లాట్ నంబరు ఎ–8 లో ఉన్న స్థలాన్ని గొండు రామన్న అనే వ్యక్తికి 1980లో కేటాయించారు. కానీ ఆయన సకాలంలో రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో టంకాల గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామన్నకు అలాట్ చేసిన స్థలాన్ని రద్దు చేశారు. అయితే 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న టంకాల అర్జున్‌ను అధికార పార్టీ నాయకులు బెదిరించి ఆ స్థలాన్ని రామన్న పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ దీనికి పాలకవర్గం అనుమతి తీసుకోలేదు. అలాగే పాలకవర్గం తీర్మానం కూడా లేదు. దీంతో ఆ రిజిస్ట్రేషన్ చెల్లదని ప్రస్తుతం అధ్య క్షుని హోదాలో ఉన్న చింతు రామారావు రిజిస్ట్రార్ కార్యాలయానికి లెటర్ పంపారు. ఇదే సమాచారా న్ని రామన్నకు కూడా తెలియజేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్థలంపై కొందరి కన్ను పడింది. ఎలాగైనా ఈ స్థలాన్ని పొందాలని సబ్ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి చేసి విజయనగరానికి చెందిన బిల్డర్‌కు రామన్న చేత మార్ట్‌గేజ్ చేయించారు. దీంతో ఆయన అపార్ట్‌మెంట్ నిర్మాణం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సొసైటీ సభ్యులు పనులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ అపార్ట్‌మెంట్‌లో పొరుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులకు వాటాలు ఉన్నట్లు సమాచారం.
నిబంధనలు ధిక్కరిస్తున్నారు
ఇందిరానగర్‌లోని మా సొసై టీ స్థలంలో అక్రమంగా అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. ఇతరులకు మార్ట్ గేజ్ చేయడానికి, అపార్ట్‌మెంట్ నిర్మాణానికి వీలు లేదు. కానీ నిబంధనలు ధిక్కరించి పనులు చేస్తున్నారు. అసలు మార్ట్‌గేజ్ చేసిన వ్యక్తికి ఈ స్థలంపై ఎలాంటి హక్కులు లేవు. సుడా అధికారులు కూడా స్థలం చూడకుండా పూర్వాపరాలు చూసుకోకుండా అపార్ట్‌మెంట్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తున్నాం.
– చింతు రామారావు,
కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు

మేం అచ్చెన్నాయుడు మనుషులం..

మేం అచ్చెన్నాయుడు మనుషులం..

మేం అచ్చెన్నాయుడు మనుషులం..