29న వైఎస్సార్‌సీపీ నేతలకు సన్మానం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురికి కీలకమైన బా ధ్యతలు అప్పగించారని, వారందరికీ ఈ నెల 29వ తేదీన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నేషనల్ హైవే పెద్దపాడు జిల్లా పార్టీ కా ర్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో సన్నా హక సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు పార్లమెంటరీ సమన్వయకర్తగా, పార్లమెంటరీ పరిశీలకులుగా కుంభా రవితో పాటు పలువురికి కీలకమైన పదవులు అప్పగించారని వారందరికీ సన్మానం చేయనున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. పథకాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అన్నారు. ప్రజలు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. సమావేశంలో కళింగవైశ్యకుల రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ, యువజన విభాగం ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడు ఎంవీ స్వరూప్, యువజన విభా గం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, బుక్కూరు ఉమామహేశ్వరరావుతో పాటు అంబటి శ్రీనివాస రావు, గొండు రఘురాం, ఎన్ని ధనుంజయరావు, పొన్నాడ రుషి, ఎంఏ బేగ్, వై.వి శ్రీధర్, టి.కామేశ్వరి, యజ్జల గురుమూర్తి, ఎస్.రామారావు, రాజాపు అప్పన్న, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్


