డిజైన్లలో లేటెస్ట్
చక్కటి టేస్ట్..
● న్యూ ఇయర్ వేడుకలకు ఆకర్షణీయమైన కేకులు సిద్ధం
● అందుబాటులో సృజనాత్మక డిజైన్లు
ఇచ్ఛాపురం రూరల్: కొత్త క్యాలెండర్ గోడకు తగిలించినా లేకపోయినా, అయిన వారికి విషెష్ చెప్పినా చెప్పకపోయినా, వాట్సాప్ స్టేటస్‌లు పెట్టినా పెట్టకపోయినా.. కేకు మాత్రం కోయాల్సిందే. కేకు లేకుండా న్యూఇయర్ సెలబ్రేషన్ అనేదే ఉండదు కదా. అందుకే బేకరీలు టేస్ట్‌తో పాటు లేటెస్ట్ డిజైన్లతో కొత్త కొత్త కేక్‌లను తయారు చేస్తున్నాయి. బెంగళూరు, మహారాష్ట్ర, బరంపురం, భువనేశ్వర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మాస్టర్స్ జిల్లాలో బేకరీలు నిర్వహిస్తూ కేకుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అందరినీ ఆకట్టుకునేలా చక్కటి డిజైన్లతో కేకులు సిద్ధం చేస్తున్నారు.
పెరిగిన డిమాండ్
ప్రస్తుతం న్యూ ఇయర్ వేడుకలతో కేకులకు డిమాండ్ పెరిగింది. దీంతో ట్రెండ్‌కు తగ్గట్టు జిల్లాలో కేక్‌లు తయారు చేస్తున్నారు. సాధారణ కేకులు కిలోకు రూ.250–రూ.500 వరకు, కూల్ కేక్స్ కిలోకు రూ. 500 మొదలుకుని రూ.3,500 వరకు ఉన్నాయి.
అన్ని వైరెటీల్లో...
కేక్స్ అన్ని వైరెటీల్లో అందిస్తున్నాం. కస్టమర్ల అభిరుచుల మేరకు అన్ని ఫ్లేవర్స్‌లో కేక్స్ సిద్ధం చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. సాధారణ కస్టమర్‌కు అనుగుణంగా ధరలు నిర్ణయించడం జరిగింది.
– కె.అనిల్, హాయ్ కేఫ్, ఇచ్ఛాపురం
గంటలోనే తయారు చేసేస్తాం
కస్టమర్లు కోరిన డిజైన్లలో కేక్స్ కేవలం గంటలోపే తయారు చేస్తున్నాం. కేక్‌లపై క్రీమ్‌తో డిజై న్లు వేయడం సొంతంగా నేర్చు కున్నా. డిసెంబర్ 31 కోసం కేక్‌లు సిద్ధం చేస్తున్నాం. అన్ని వైరెటీల కేక్స్, ఆన్‌లైన్‌లో కనిపించే వైరెటీ కేక్స్‌ను ఆర్డర్లను బట్టీ తయారు చేసి ఇస్తున్నాం. – జి.గణేష్, కేక్ మేకర్, ఇచ్ఛాపురం
డిజైన్లలో లేటెస్ట్
డిజైన్లలో లేటెస్ట్
డిజైన్లలో లేటెస్ట్
డిజైన్లలో లేటెస్ట్


