పగలూ రాత్రి లేకుండా చోరులు ఈ ఏడాది రెచ్చిపోయారు. చైన్
ప్రయాణంలో చోరీలు..
ఎంబీఏ చదివిన చిన్నబాబు దొంగగా మారాడు. వృద్ధులను ఏమార్చి ఏటీఎం కార్డులు మార్చి డబ్బు కొట్టేయడంలో ఘనుడు. ఇతడిది నరసన్నపేట. సాంకేతికంగాను, చదువులోనూ తెలివైనవాడైన చిన్నబాబు జల్సాలకు అలవాటు పడి గత పదేళ్లుగా చోరీలు చేస్తూ కటకటాల్లోకి వెళ్లాడు. ఆమదాలవలస పోలీసులు అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎంబీఏ చదివి దొంగతనాలు
ఏటీఎం దొంగపై 30 కేసులు
అరెస్టు : 15 సెప్టెంబరు 2025
ఎగుమతులు, దిగుమతుల కోసం లారీల్లో వస్తాడు. స్వకార్యంతో పాటు చోరీ కార్యం కూడా కానిచ్చి వెళ్లిపోతాడు. అతడే ఉత్తరాఖండ్ డెహ్రడూన్‌కు చెందిన నూర్‌హసన్. 140 ఇళ్లకు కన్నాలేసి 32 చోరీకేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 18 కేసులున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాయపూర్‌కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్, అబ్ధుల్ గఫూర్‌లతో కాశీబుగ్గలో చోరీలు చేశాడు. కందిపప్పు లోడు రాయపూర్ నుంచి కాశీబుగ్గ తెచ్చి ఇక్కడి నుంచి జీడిపప్పుతో పాటు మార్గమధ్యంలో దొంగతనాలు చేసేవాడు. చోరీ సొత్తు ఉత్తర ప్రదేశ్‌లో అమ్ముతాడు.
140 దొంగతనాలు..
32 సార్లు అరెస్టు
అరెస్టు : 15 ఏప్రిల్ 2025
బ్లేడు చూపిస్తాడు..
49 తులాల బంగారం,
6.8 కిలోల వెండి స్వాధీనం..
అరెస్టు : 21 సెప్టెంబరు 2025
పట్టుకోబోతే మెడపై బ్లేడు పెట్టుకుంటాడు. పట్టుకోకుంటే వరుస పెట్టి దొంగతనాలు చేస్తాడు. అతడే కుప్పిలి రాజు. విజయనగరం జిల్లా సంతకవిటికి చెందిన ఇతడు కుప్పిలి నర్సింగరావుతో కలిసి 68 దొంగతనాలకుపైగా చేశాడు. సీసీఎస్ పోలీసులు పట్టుకోగా ఆమదాలవలస పోలీసులు చోరీ సొత్తు రికవరీ చేశారు.
పగలూ రాత్రి లేకుండా చోరులు ఈ ఏడాది రెచ్చిపోయారు. చైన్


