రాజకీయ కక్ష.. పేదలకు శిక్ష
కక్ష పూరితం
ఇందిరమ్మ హయాంలో పేద రైతులకు పట్టాలు ఇచ్చారు. స్థానిక టీడీపీ సర్పంచ్ కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై కక్ష కట్టి ఇలా చేస్తున్నారు. – రుప్ప అప్పలసూరి, ఎంపీటీసీ
కేసు కోర్టులో ఉన్నా..
ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో మాకు పట్టాలు ఇచ్చారు. దశాబ్దాలుగా వరి, చెరుకు, పెసలు, మినుములు పండిస్తున్నాం. ఇప్పుడు ఈ భూమిని రెవెన్యూ అధికారుల స్వాధీనం చేసుకోవడం అన్యాయం. కోర్టులో కేసు నడుస్తున్నా చెట్లు ధ్వంసం చేశారు.
– రుప్ప సింహాచలం, సానివాడ గ్రామం
శ్రీకాకుళం రూరల్/గార: శ్రీకాకుళం మండల పరిధిలోని సానివాడ పంచాయతీ, గార మండలం అంపోలు రెవెన్యూ పరిధిలో బరాటం చెరువు వద్ద సర్వే నంబర్ 199లో 19 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో పేద రైతులకు 5 ఎకరాల 50 సెంట్లు భూమిని 1975లో అందజేశారు. వారు 50 ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిపై కూటమి నేతల కన్ను పడింది. స్థలం గార రెవెన్యూ పరిధిలో ఉండడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం పోలీసు బందోబస్తుతో ఆరు పొక్లెయినర్‌లు పెట్టి చెరువు గర్భంలో గల ప్రభు త్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి పూనుకున్నారు. అడ్డువచ్చిన రైతులను ఎక్కడికక్కడ ఆపేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వాళ్లం కాబట్టే ఇలా కక్ష సాధిస్తున్నారని రైతులు చెబుతున్నారు.
సానివాడ పంచాయతీ అంపోలు రెవెన్యూ పరిధిలో 19 ఎకరాలు స్వాధీనం
దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిపై రాజకీయ కుట్ర
ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో రైతులకు పట్టాలు
రాజకీయ కక్ష.. పేదలకు శిక్ష
రాజకీయ కక్ష.. పేదలకు శిక్ష


