ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినం మంగళవారం ఘనంగా నిర్వహించేలా ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మంగళవారం వేకువజామున శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీసూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను తిరువీధిగా ఊరేగించి వైకుంఠ (ఉత్తర) ద్వారం నుంచి ఆలయం లోపలకు తీసుకువెళ్లనున్నారు. అనంతరం ఇదే ఉత్తర ద్వారం నుంచి భక్తులకు సర్వదర్శనాలు ఉంటాయని ఈఓ ప్రకటించారు. అనంతరం అనివెట్టి మండపంలో ఉత్సవమూర్తులకు కల్యాణాన్ని జరిపించనున్నట్టుగా ప్రధానార్చకులు శంకరశర్మ తెలియజేశారు.
కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలి
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దాన ప్రాంతంలో ప్రభుత్వాలు తలపెట్టిన కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమవారం కమిటీ అధ్యక్షు డు కొమర వాసు అధ్యక్షతన సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, న్యూ డెమొ క్రసీ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రామారావు, పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్టు పేరుతో చేస్తున్న భూ సేకరణ ఆపాలని కోరారు. ఉద్దాన ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తిప్పికొట్టడానికి జనవరి 7 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘మా ఊరు మా భూములు’ పేరిట భూములను కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్దానంలో ఏళ్ల తరబడి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి నియంత్రణకు శాశ్వత పరిష్కారం చేయాలని, ఉద్దాన ప్రాంతంలో జీడి ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం కుట్రలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నా రు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు రెసిడెన్సీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని అన్నారు. ఉద్యమాలను అణచివేసేందుకే ఇప్పుడు కొత్తగా 50 ఏళ్ల నుంచి పుట్టిన ఉద్యమాల గురించి ఆరా తీస్తున్నారని తెలిపారు. ఆనాడు పార్లమెంట్‌లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండడంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, నేడు మోదీ ప్రభుత్వం ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరుని తొలగించడమే కాకుండా నిధు ల కోత విధించిందని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్న చంద్రబాబు మోదీని మించిపోయారని విమర్శించారు. బల్క్ డ్రగ్ కేంద్రాన్ని ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తుంటే వారికి అండగా నిలిచిన అనకాపల్లి సీపీఎం నాయకులు అప్పలరాజును అరెస్టు చేసి పీడీ యాక్ట్ పెడతామని బెదిరింపులకు పాల్పడడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌మెంట్లలో కీలక పదవిని చేపట్టిన కె.సుజాతరావు కూడా ప్రభు త్వ వైద్యశాలలు ప్రైవేటుపరం చేస్తే పేదలకు వైద్య విద్యుత్‌తో పాటు, వైద్యం కూడా భారం అవుతుందని చెప్పారని గుర్తు చేశారు. అమరా వతి కోసం 54 వేల ఎకరాలు భూములు తీసుకుని 12 ఏళ్లు అవుతున్నా భూములు ఇచ్చిన రైతులకు ఒక పట్టానైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 1500 ఎకరాలు అవసరమని చంద్రబాబు చెబుతున్న తీరు దారుణమని అన్నారు.
ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు
ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు


