కిటికీ పక్కన తాళాలు పెట్టారో..
112 తులాలు కొట్టేసిన ఘనులు
అరెస్టు : 18 జనవరి 2025
షూ ర్యాక్‌లు, ఎలక్ట్రికల్ మీటర్ రీడింగ్‌బోర్డులు, పూలకుండీలు, కిటికీ లోపల తాళాలు పెడితే.. వారికి ఇట్టే తెలిసిపోతుంది. వారే విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ వున్నాన రాంబాబు, మన జిల్లా జి.సిగడాంకు చెందిన గిడిజాల కోటేశ్వరరావు. దాచిన తాళాలు కనిపెట్టి దొంగతనాలు చేస్తారు. ఇంటిలో ఎక్కడా ఏ వస్తువు టచ్ చేయకుండా.. ఫింగర్ ప్రింట్స్ దొరక్కుండా జాగ్రత్తపడతారు. ఏడాది వ్యవధిలో 32 చోరీలకు పాల్పడి మొత్తం 112 తులాల బంగారాన్ని కాజేశారు. మన పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌పై విడుదలైన రాంబాబు 15 చోరీలు చేయడంతో కృష్ణాజిల్లా కంకిపాడు పోలీసులు ఈనెల 21న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


