జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వైశాఖిమాసం మొదటి ఆదివారం భక్తులు సందడి చేశారు. హిరమండలం పరిధి అంబా విల్లి త్రినాథ స్వామికి మొదటి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు శ్రీముఖ లింగం తండోపతండాలుగా వచ్చి పూజలు నిర్వహించారు. అలాగే జిల్లా నలుమూలలతోపాటు పక్క రాష్ట్రాలైన వియనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలి వచ్చారు. అర్చకులు గణ పతి పూజతో ప్రారంభించి స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వారాహి అమ్మవారికి కూడా కుంకుమ పూజలు చేశారు. మరికొంద రు తమ కోర్కెలు తీరడంతో గోలెంలో బియ్యం వేసి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీముఖలింగంలో నరసింహ జయంతి
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం ఆలయ పరిధి నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ మాసం ఆదివారం ఘనంగా నరసింహ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతి అయిన బెల్లం, పానకాలు నైవేద్యం సమర్పించి భక్తులు పంచిపెట్టి నట్లు అర్చకులు విశ్వనాథ్ దాస్, ప్రసాద్ పాడి తెలిపారు. అనంత రం స్వామివారికి హారతులిచ్చారు.
రోడ్డు ప్రమాదంలో క్లీనర్‌కు గాయాలు
రణస్థలం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, హైవే పెట్రోలింగ్ ఏఎస్‌ఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న లారీ ముందు వెళుతున్న లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో క్లీనర్ సదాశివం కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. వెంటనే హైవే పోలీసులు అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కళకళలాడిన కాంప్లెక్స్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కళకళలాడుతూ కనిపించింది. అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ప్రయాణికుల తాకిడి మరింత అధికమైంది. తిరుగు ప్రయాణంలో కాంప్లెక్స్‌లో నాన్‌స్టాప్ కౌంటర్ వద్ద ప్రయాణికులు టికెట్‌ల కోసం క్యూలో బారులు తీరుతూ కనిపించారు. నాన్‌స్టాప్ బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్టీసీ అధికారులు త్వరితగతిన స్పందించి ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు నాన్‌స్టాప్ బస్సుల స్థానంలో పల్లెవెలుగు బస్సులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నడిపారు.
‘బకాయి వేతనాలు చెల్లించండి’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన మార్చి నెల బకాయి వేతనం రూ. 7,200 వెంటనే చెల్లించా లని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌర వ అధ్యక్షులు కె.నాగమణి, డి.ధనలక్ష్మి, జి.అమ రావతి డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో సీఐటీయూ కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్‌తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మార్చి నెల పూర్తి వేతనం చెల్లించినా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అధికారుల జాప్యం వల్ల జీతం రాలేదని అన్నా రు. ఆశాలకు రికార్డులు అవసరం లేదని మొబై ల్ యాప్‌లో పని చేయాలని రాష్ట్ర అధికారులు ఆదేశాలిస్తే జిల్లాలో రికార్డు పని, ఆన్‌లైన్ పని రెండు రకాలు పనులు చేయిస్తూ పని భారం పెంచుతున్నారన్నారు. లేబర్ కోడ్లు రద్దు, కనీ స వేతనం 26 వేలు ఇవ్వాలని కోరుతూ కార్మి క సంఘాలు పిలుపుమేరకు మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను ఆశాలంతా జయప్రదం చేయాలని కోరారు.

శ్రీముఖలింగంలో భక్తుల సందడి