
● ఎస్పీ గ్రీవెన్స్‌కు 61 వినతులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యా దుల స్వీకరణ కార్యక్రమంలో (గ్రీవెన్సు) ప్రజల నుంచి 61 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వినతులు స్వీకరించిన అనంతరం ప్రజా ఫిర్యాదులు పెండింగ్ ఉంచరాదని అధికారులను ఆదేశించారు.
నిందితులను శిక్షించాలి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని జామియా మసీదులో ఇటీవల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చందనం చెట్లను నరికి అక్రమంగా తరలించిన విషయం తెలిసిందే. దీనిపై మత పెద్దలు ఎం.ఎ.రఫీ, ఎం.ఏ.బేగ్ మరికొందరు సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని కలసి సమగ్ర విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని కోరారు. 400 ఏళ్ల పైబడిన జామియా మసీదు శ్మశాన వాటికతో కలసి 17 ఎకరాల విస్తీర్ణంలో వృక్షసంపదతో నిండి ఉందని, 40 చందనపు మొక్కలు, చెట్లు ఉండేవని, వాటిలో కొన్నింటిని నరికేసి అక్రమంగా తరలించడంపై ఇప్పటికే ఒకటో పట్టణ సీఐ, ఎస్‌లకు వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు చేశామని అన్నారు.