
ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చె..
● మెట్టవలసలో ఎట్టకేలకు గ్రామదేవత పండుగలు ● సిరిమాను, ఘటాలు లేకుండా ఉత్సవాల నిర్వహణ
నా చిన్నప్పుడు జరిగింది..
నాకు 85 ఏళ్లు. నా చిన్నప్పుడు మా ఊరిలో గ్రామదేవత పండగ చేశారు. నాకు తెలిసీతెలియని వయసులో జరిగింది. ఇప్పుడు మళ్లీ మా గ్రామస్తులంతా కలిసి గ్రామదేవత పండగను నిర్వహిస్తున్నాం.
– డకర లక్ష్ముంనాయుడు, మెట్టవలస
80 ఏళ్లవుతోంది..
నాకు 90 ఏళ్లు. నేను 5వ తరగతి చదువుతున్నప్పు డు మా గ్రామంలో తాత లు, పెద్దలు గ్రామ దేవత పండగ చేశారు. మా ఊరిలో మొదటి ఉద్యోగం చేసిన వాడిని నేనే. ఈ వయసులో మళ్లీ గ్రామదేవత పండగ చూసే అదృష్టం కలగడం ఆనందంగా ఉంది.
– యడ్ల ఆదినారాయణ,
విశ్రాంతి పంచాయతీ అధికారి, మెట్టవలస
జి.సిగడాం: మండలంలోని మెట్టవలసలో ఎట్టకేల కు గ్రామదేవత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయం చేశారు. గ్రామంలో 650 ఇళ్లు ఉన్నాయి. అంతా కలిసికట్టు గా పండుగ నిర్వహించేందుకు తీర్మానించారు.
80 ఏళ్ల తర్వాత..
గ్రామంలో ఈ ఉత్సవాలు జరిగి 80 ఏళ్లయ్యాయి. అప్పటి నుంచి ఉత్సవాలు జరగనేలేదు. మళ్లీ ఆ నాటికి ఉత్సవం నిర్వహిస్తుండడంతో ఊరు ఊరంతా సంబరపడుతోంది. దాదాపు రూ.7కోట్ల వ్య యంతో జాతర నిర్వహిస్తున్నారు. అయితే సిరిమాను గానీ, ఘటాలు గానీ లేకుండా పండుగ జరిగేలా ఏర్పాట్లు చేశారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చె..

ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చె..

ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చె..