98 ఏళ్ల వృద్ధుడు అదృశ్యం
కాశీబుగ్గ: పలాస మండలం పెదంచల పంచాయతీ మరదరాజపురం గ్రామానికి చెందిన 98 ఏళ్ల వృద్ధుడు నర్సింగ పండా (98) కనిపించడం లేదని కుమారుడు జగన్నాథ పండా సోమవారం కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేషన్ డీలర్‌గా పనిచేస్తున్న నర్సింగ పండా షుగర్ బాధపడుతున్నారు. సమయానికి భోజనం పెట్టలేదని భార్య జయంతి పండాపై కోపంతో ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. పరిసర ప్రాంతాలు, బంధువులు ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు తెలిస్తే 94937 90587 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.


