
ఆకట్టుకున్న పప్పెట్రీ
టెక్కలి: టెక్కలి ప్రజా చైతన్య కళా సమితి భవన్‌లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా గురువారం చేపట్టిన పప్పెట్రీ ఆకట్టుకుంది. ఉపాధ్యాయులు డీఏ స్టాలిన్, ఆర్.వి.రమణమూర్తి, మోహన్ గౌడు ఆధ్వర్యంలో బొమ్మలతో అభినయం చేస్తూ కథలు ప్రదర్శన చేశారు. పులి బంగారం కడియం, మిత్రలాభం–మిత్రభేదం తదితర పంచతంత్ర కథలను ప్రదర్శన ద్వారా పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎం.పద్మనాభరావు, గణపతిరావు, ఎం.తాతయ్య, పి.హరిశ్చంద్రరావు, టి.భాస్కరరావు, కృష్ణారావు పాల్గొన్నారు.