
అపస్మారక స్థితిలో విశ్రాంత ఉద్యోగి
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గురువారం ఓ ప్రయాణికుడు దుస్తులు లేకుండా అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని ఆర్టీసీ ఎస్‌ఎం ఎంపీ రావు గమనించారు. వెంటనే కాంప్లెక్స్ ఔట్‌పోస్ట్ హెచ్‌సీ ఎన్.శ్రీనివాసరావుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. ఆయన వచ్చి పక్కనే ఉన్న దుస్తులను పరిశీలించగా ఆధార్‌కార్డు, ఫోన్ నంబరు లభించాయి. వాటి ఆధారంగా కంచిలి మండలం పెద్దపోలేరు గ్రామానికి చెందిన తులసీదాస్ వెంకటస్వామి మల్లపురెడ్డిగా గుర్తించా రు. విశ్రాంత ఉద్యోగి అని, కుటుంబ సభ్యులు ముంబైలో ఉంటున్నట్లు తెలుసుకుని వారికి సమా చారం అందించారు. ఇటీవల కంచిలి మండలం పెద్దపోలేరులో జరిగిన పండగలకు వచ్చి తిరుగు ప్రయాణంలో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు గుర్తించి 108 రిమ్స్‌కు తరలించారు. ఆర్టీసీ సెక్యూరి టీ గార్డు జి.రామారావు తదితరులు ఉన్నారు.