
రైలు ఢీకొని యువకుడికి గాయాలు
కాశీబుగ్గ: కాశీబుగ్గ ఎల్‌సీ గేట్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రి రిమ్స్‌కు తరలించారు. గాయపడిన వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన యువకుడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేడు జాబ్‌మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ : నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నెహ్రూ యువకేంద్రం ప్రాంగణం వేదికగా శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ, నవత ట్రాన్స్‌పోర్టులో వివిధ ఉద్యోగాల భర్తీకి 18 నుంచి 46 ఏళ్ల సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నారు. టెన్త్‌క్లాస్ పాస్/ఫెయిల్, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ చదివిన వారు ఉదయం 10 గంటలకు బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని కోరారు.