
ట్రస్ట్ బోర్డు నియామకాలకు గ్రీన్‌సిగ్నల్
అనర్హులకు చోటు లేకుండా
నియామకాలు
జిల్లాలో 16 ఆలయాల కు ట్రస్ట్ బోర్డు నియామకాలు చేపట్టనున్నాం. ఈ మేరకు ఈనెల 28లోగా దరఖాస్తులను స్వీకరించనున్నాం. అయితే దేవదాయ శాఖకు, హిందూ ఆలయాల వ్యవస్థకు, సంస్థలకు వ్యతిరేకంగా పనిచేసిన వారు, సంస్థకు చెందిన భూములను లీజులు, కౌలు కింద అనుభవిస్తున్న వారు, వరుసగా రెండు సార్లు ధర్మకర్తలుగా పనిచేసిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్రిమినల్ కేసులున్న వారు, మద్యం సేవించిన వారు ఈ ధర్మకర్తల పోస్టులకు అనర్హులు. ఇలాంటి వారు లేకుండా నియామకాలను చేపట్టేలా చర్యలు చేపడతాం.
– బి.ప్రసాద్ పట్నాయక్,
జిల్లా దేవదాయశాఖాధికారి
అరసవల్లి: జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలోని 6–బి హోదా ఆలయాల్లో పాలక మండలి నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 16 ఆలయాలకు మరికొద్ది రోజుల్లోనే పాలకమండలి సభ్యులు కొలువుతీరనున్నారు. నిబంధనల ప్రకా రం పక్కాగా హిందువై ఉండి.. ఎలాంటి కోర్టు లావాదేవీలు, క్రిమినల్ కేసులు లేని వారిని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యతలను దేవదాయశాఖ కమిషనర్ నిర్వర్తించనున్నారు. ఆయా ఆలయాల్లో పాల క మండలి సభ్యుల స్థానాలకు దరఖాస్తులను స్వ యంగా జిల్లా దేవదాయ శాఖ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంది. ఇందుకు ఈనెల 28వ తేదీ సాయంత్రం 5 వరకు గడువు ఖరారు చేశారు.
అయితే పూర్తి రాజకీయ అండదండలతోనే దాదాపుగా పాలకమండలి సభ్యుల ఎంపిక ఉంటుందన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ అగ్రనేతల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు మొదలు పెట్టేశారు. గార మండలం శాలిహుండం కొండపై వేంచేసి ఉన్న శ్రీ కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయంపై ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ ట్రస్ట్ బోర్డు లేకపోవడంతో పాటు ఇక్కడి ఆలయ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఆలయ పాలకమండలి నియామకాలపై స్థానిక గార మండల టీడీపీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సా రించారని తెలుస్తోంది.
జిల్లాలో 16 దేవాలయాల్లో ట్రస్టీలు
దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో రూ.25 లక్షల లోపు ఆదాయం ఉన్న (6–బి) ఆలయాల్లో తొలిదశగా 16 ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాళీయ మర్దన వేణుగోపాలస్వామి ఆల యం (శాలిహుండం), ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయం(గుడివీధి–శ్రీకాకుళం), శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం (పాలకొండ రోడ్డు–శ్రీకాకు ళం), వెంకటేశ్వర స్వామి ఆలయం (చిన్నబజార్–శ్రీకాకుళం), ఏవీపీ చౌల్ట్రీ (జిల్లా దేవదాయ శాఖ కార్యాలయ ప్రాంగణం), వేంకటేశ్వర స్వామి ఆలయం (ఫాజుల్‌బాగ్‌పేట–శ్రీకాకుళం), కనకదుర్గ ఆలయం (బ్రిడ్జి రోడ్డు–శ్రీకాకుళం), భీమేశ్వర స్వామి ఆలయం (కొన్నావీధి–శ్రీకాకుళం), లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (తుమ్మావీధి–శ్రీకాకుళం), గోపాల–జగన్నాథస్వామి వారి ఆలయం (టెక్కలి), లక్ష్మీ నరసింహ స్వామి ఆల యం(టెక్కలి), శ్రీ లక్ష్మణ బాలాజీ ఆలయం (టెక్క లి), రఘునాధ స్వామి ఆలయం (సిరిపు రం–మందస), వెంకటేశ్వర స్వామి వారి ఆలయం (నరసన్నపేట), కోదండరామ స్వామి వారి ఆల యం (సోంపేట), పెద్ద జగన్నాథ స్వామి వారి ఆలయం (ఇచ్ఛాపురం)లో పాలకమండలి సభ్యుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు
దేవాలయాల్లో పాలకమండలి సభ్యుల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల్లో గరిష్టంగా 9 మంది పాలకమండలి సభ్యులు ఉండాలి (చైర్మన్‌తో సహా). వంశపారం పర్యంగా ధర్మకర్తలుంటే వారే చైర్మన్లుగా వ్యవహరించనున్నారు. మిగిలిన సభ్యుల స్థానాలకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్థాయి (6–బి) ఆలయాల్లో మొత్తం 9 మంది సభ్యుల్లో కచ్చితంగా మహిళల కోటా 50 శాతం అంటే కనీసం నలుగురు మహిళా సభ్యుల (ఓపెన్) నియామకం తప్పనిసరి అనే నిబంధన ఉంది. అ లాగే మొత్తం సభ్యుల సంఖ్యలో నలుగురు ఓసి కేటగిరిలో (ఇందులో ఒకరు కచ్చితంగా బ్రాహ్మణులై ఉండాలి), మిగిలిన ఐదుగురిలో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీకి చెందిన వారు, మిగిలిన నలుగురు బీసీ కేటగిరికి చెందిన వారు (ఇందులో ఒకరు కచ్చితంగా నాయీ బ్రాహ్మణుడు ఉండాలి) ఉండాలనే నిబంధనలను అమలు చేయాల్సి ఉందని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈనెల 28లోగా దరఖాస్తులకు గడువు
జిల్లాలో మొత్తం 16 ఆలయాల్లో ట్రస్ట్‌బోర్డులకు నోటిఫికేషన్ విడుదల

ట్రస్ట్ బోర్డు నియామకాలకు గ్రీన్‌సిగ్నల్