
వ్యక్తి అనుమానాస్పద మృతి
సరుబుజ్జిలి: మండలంలోని కూనజమ్మన్నపేటకు చెందిన రోజువారీ కూలీ హనుమంతు వెంకటరావు(60) అనుమానాస్పదంగా మృతిచెందాడు. వెంకటరావు ఎప్పటిలాగానే ఆదివారం సరుబుజ్జిలి కూలీ పనులకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్న సమయంలో సరుబుజ్జిలికి చెందిన ఓ వ్యక్తి సమాచారం ఇస్తూ సరుబుజ్జిలి, కూనజమ్మన్నపేట గ్రామాల మధ్య రహదారి పక్కన వెంకటరావు పడి ఉన్నట్లు చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్సు సాయంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. భార్య నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్టుమార్టమ్ నిర్వహించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసినట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు.