
శ్రీముఖలింగం భూములకు సాగు వేలం ఖరారు
జలుమూరు: శ్రీముఖలింగం భూములకు సాగు వేలం ఖరారైంది. ‘వేలానికి వేళ కాలేదా’ అన్న శీర్షికన ఈ నెల నాల్గో తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనానికి దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారులు స్పందించారు. సుమారు 32 ఎకరాలు(మెట్టు,పల్లం) ఆలయ భూములకు సంబంధించి మంగళవారం బహిరంగ వేలం ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన దేవదాయ శాఖ కార్యాలయంలో ప్రథమ ధరావత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని ఈఓ పి.ప్రభాకరరావు తెలిపారు. మొత్తం ఆరుబిట్లుగా విడదీసి వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడేళ్లకు హక్కులు ఉంటాయని తెలిపారు.