
ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి
పొందూరు: ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డ పోరంబోకు స్థలాలు ఆక్రమించినవారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. మండలంలోని తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 5లో వీరమరణం పొందిన సైనికులకు ఇవ్వనున్న స్థలాన్ని శనివారం పరిశీలించారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో వీరమరణం పొందిన సింగూరు విష్ణుమూర్తి సతీమణి శాంతకు తోలాపిలో 2.5 ఎకరాలు స్థలం కేటాయించారు. అయితే ఆ స్థలంలో చెరువు గర్భం ఉండడంతో దీనిని రద్దు చేశారు. తనకు భూమి కేటాయించాలని సింగూరు శాంత ఉన్నతాధికారులకు వినతి అందించడంతో సెక్రటేరియట్ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో బొట్లపేట సర్వే నంబర్ 5లో స్థల పరిశీలన చేశారు. ఆమెకు పట్టా, పాస్‌బుక్‌లు సిద్ధం చేయాలని తహశీల్దార్ ఆర్.వెంకటేష్‌ను ఆదేశించారు.