రిమ్స్ సూపరింటెండెంట్‌గా అమూల్య
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ సి.అమూల్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా నుంచి బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అమూల్యను ప్రభుత్వం ఇటీవలే ప్రిన్సిపాల్‌గా నియమించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది సహకారంతో రోగులుకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో ఓపీ సంఖ్య పెరిగేలా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం పలువురు వైద్యులు సిబ్బంది అమూల్యను అభినందించారు.


