
జెడ్పీలో పదోన్నతులు
శ్రీకాకుళం అర్బన్: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ తన అధికార నివాసమైన జెడ్పీ బంగ్లాలో ఐదుగురు సీనియర్ సహాయకులకు అడ్మినిస్ట్రేటివ్ అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం నియామక ఉత్తర్వుల పత్రాలను సంబంధిత ఉద్యోగులకు అందజేశారు. సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయ సీనియర్ సహాయకులు డి.నరసింగరావును పదోన్నతిపై సంతబొమ్మాళిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ సర్‌గా నియమించారు. అలాగే హిరమండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయ సీనియర్ సహాయకులు ఎన్.సోమశేఖర్‌ను పదోన్నతిపై వంగర మండలంలోని ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. అదేవిధంగా కొత్తూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయ సీనియర్ సహాయకులు ఎ.మార్కండేయరావును పదోన్నతిపై రణస్థలం మండల ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. అదేవిధంగా శ్రీకాకుళంలోని జిల్లా ప్రజాపరిషత్ సీనియర్ సహాయకులు కె.ఉమామహేశ్వరరావును పదోన్నతిపై శ్రీకాకుళంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. అలాగే ఎస్‌సీఎస్‌సీఎస్ లిమిటెడ్‌లో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న జి.మధుసూధనరావును పదోన్నతిపై పొందూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. కార్యక్రమములో జెడ్పీ సీఈఓ ఎల్‌ఎన్‌వీ శ్రీధర్‌రాజా, జెడ్పీ డిప్యూటీ సీఈఓ డి.సత్యనారాయణ, జెడ్పీ సి–సెక్షన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్, సి–సెక్షన్ సిబ్బంది, పదోన్నతులు పొందిన ఉద్యోగులు పాల్గొన్నారు.