
చనిపోయిన వ్యక్తికి సీపీఆర్
శ్రీకాకుళం క్రైమ్ : గత నెల 29న రోడ్డు ప్రమాదాని కి గురై మెడికవర్ ఆస్పత్రిలో చేరిన రణస్థలం మండలం కొండములగాం గ్రామానికి చెందిన కొండ్రు త్రినాధరావు (32) చికిత్స పొందుతూ మృతి చెంది నప్పటికీ ఆ విషయం బయటకు చెప్పకుండా చికిత్స పేరుతో లక్షలు రూపాయలు కట్టించుకుని మోసం చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరో పించారు. ఈ మేరకు బాధిత యువకుడి బంధువు లు, గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆసుపత్రి వద్ద గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఒకటో, రెండో పట్టణ సీఐలు పైడపునాయుడు, ఈశ్వరరావు, ఆమ దాలవలస సీఐ సత్యనారాయణ, ఎచ్చెర్ల ఎస్‌ఐ సందీప్, శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ రాము, ఆమదాలవలస ఎస్‌ఐ, స్పెష్‌ల్‌బ్రాంచి, ఇంటెలిజెన్సు పోలీసులు ఆసుపత్రి వద్ద మోహరించారు. అంతకుముందు బాధితులు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా దళిత ఐక్య వేదిక కమిటీ సభ్యుడు నందేశ్వరరావు మాట్లాడు తూ యువకుడు చనిపోయినా విషయం చెప్పకుండా మందులు, వైద్యం పేరిట రూ.లక్షల్లో కట్టించుకోవడం దారుణమన్నారు. మృతుడి తల్లి తవిటమ్మ మాట్లాడుతూ డబ్బులు కట్టించుకుని అన్యాయంగా తన బిడ్డను చంపేశారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మృతుడి తండ్రి అప్పారావు మాట్లాడుతూ ఇన్ని రోజులూ ఫర్వాలేద ని చెప్పారని, తీరా దగ్గరికి వెళ్లి చూశాక కొడుకు చనిపోయారని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబీకురాలు ఉష మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేశారని ఆరోపించారు. నాలు గు లక్షలు ఖర్చయ్యిందని, కలెక్టర్, ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని కోరారు.
మృతుడి కుటుంబీకుల ఆరోపణ
గ్రామస్తులతో కలిసి ఆస్పత్రి ఎదుట ధర్నా