ముగిసిన పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

May 16 2025 12:22 AM | Updated on May 16 2025 12:22 AM

ముగిస

ముగిసిన పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

ఎచ్చెర్ల క్యాంపస్‌: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ పీజీ సెట్‌ –2025 దరఖాస్తులు స్వీకరణ గడువు ముగిసింది. మా ర్చి 31న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. రూ. 2000 అదనపు రుసుముతో ఈ నెల 20 వరకు, రూ. 4000 అదనపు రుసుము తో 24 వరకు, రూ.10,000 అదనపు రుసుము తో 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీరిస్తారు. మే 30 నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. జూన్‌ 9 నుంచి 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలు కూడా ఏపీ పీజీసెట్‌ – 2025 ద్వారానే నిర్వహిస్తారు.

నేడు డెంగీ అవగాహన ర్యాలీ

అరసవల్లి: జాతీయ డెంగీ నివారణ దినోత్స వం సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాల యం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న ట్లు జిల్లా మలేరియా నివారణాధికారి పి.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనిత బృందం ఈ ర్యాలీని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఏడు రోడ్ల కూడలి లో ప్రతిజ్ఞ అనంతరం కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు.

రైలు ఢీకొని ఆవు మృతి

టెక్కలి రూరల్‌: స్థానిక తెంబూర్‌ రోడ్డులో రైల్వే గేటు సమీపంలో గురువారం రైలు ఢీకొని ఆవు మృతిచెందింది. గుణ్‌పూర్‌ నుంచి పూరి వైపు వెళ్తున్న రైలు టెక్కలి సమీపంలోకి వచ్చేసరికి పట్టాలపైకి ఆవు రావడంతో ఈడ్చుకుపోయింది. ఈ క్రమంలో ట్రైన్‌ ఇంజిన్‌కు చెంది న కొన్ని భాగాలు సైతం విరిగి పడ్డాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు.

టెక్కలి ఎంజేపీ విద్యార్థినికి

ప్రశంసలు

టెక్కలి: టెక్కలి ఎంజేపీ ఏపీ బాలికల పాఠశాలకు చెందిన జె.నవ్య ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 590 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా గురువారం విజయవాడ లో జరిగిన అభినందన సభలో ప్రశంసాపత్రం, అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ పూసపాటి సుధారాణి తెలిపారు. బీసీ సంక్షేమ శాఖామంత్రి ఎస్‌.సవిత, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సత్యనారాయణ, ఎంజేపీ ఏపీ పాఠశాలల సెక్రటరీ మాధవీలత, పూర్వపు సెక్రటరీ కృష్ణమోహన్‌ తదితరుల చేతుల మీదుగా ప్రశంసాపత్రం, అవార్డు అందుకున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు శివచరణ్‌

ఎచ్చెర్ల క్యాంపస్‌: చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థి ఎండ శివచరణ్‌ రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికయ్యా డు. సీఎస్‌ఈ బ్రాంచ్‌ మూడో ఏడాది చదువుతున్న శివచరణ్‌ ఇటీవల విజయనగరం జిల్లా కొండవెలగాడలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్‌ –23 విభాగంలో 67 కిలోల గ్రీకోరోమన్‌ విభాగంలో ప్రతిభ కనబర్చాడు. దీంతో ఈ నెల 17, 18 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు అర్హత సాధించాడు. విద్యార్థిని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, ఫ్యాకల్టీ, యాజమా న్య సభ్యులు గురువారం అభినందించారు.

ముగిసిన పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ 1
1/2

ముగిసిన పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

ముగిసిన పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ 2
2/2

ముగిసిన పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement