
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్‌ను తొలగించేందుకు రెడీ అయ్యింది.
ఈ తరుణంలో రవికుమార్‌ను విధుల నుంచి తొలగించవద్దంటూ కొఠారి గ్రామస్తులు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను ఆశ్రయించారు. రవి కుమార్ ఏ తప్పూ చేయలేదని, అతన్ని తొలగించవచ్చని ఎమ్మెల్యేని కోరారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ మహిళలతో ఎమ్మెల్యే బెందాళం అశోక్ దురుసుగా మాట్లాడారు.
ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ..‘వాడికి ఎందుకంత కొవ్వు. నేను ఎమ్మెల్యేని. నేను పిలిస్తే వాడు రాడా? వాడు నా దగ్గరికి ఎందుకు రాలేదు?’అంటూ దురుసుగా మాట్లాడారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ గ్రామస్తులు, మహిళలతో దురుసుగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో బెందాళం అశోక్ అలా దురుసుగా మాట్లాడడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా గ్రామస్తులు ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం, ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
