వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. | - | Sakshi
Sakshi News home page

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

May 16 2025 12:25 AM | Updated on May 16 2025 12:25 AM

వివిధ

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

● తాళి కట్టిన శుభవేళ..

శ్రీకాకుళం న్యూకాలనీ/ గార/కంచిలి/ శ్రీకాకుళం రూరల్‌/ సోంపేట/ జలుమూరు/సారవకోట/ బూర్జ: ఏపీఈసెట్‌–2025 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఏపీఈసెట్‌ ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించారు.

92.97 శాతం మంది అర్హత..

పునర్విభజన శ్రీకాకుళం జిల్లా ఏపీఈసెట్‌–2025 ఫలితాల్లో 92.97 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షలకు జిల్లా నుంచి 1671 మంది దరఖాస్తు చేసుకోగా.. 1621 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 92.97 శాతం ఉత్తీర్ణతతో 1507 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో బాలురు 1049 మంది, బాలికలు 458 మంది ఉన్నారు. బాలురు91.94శాతం అర్హత సాధించగా, బాలికలు 95.42 శాతం మంది అర్హత సాధించి మరోసారి బెటర్‌ అనిపించారు.

అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో జిల్లాలోని గార మండలం అంపోలుకు చెందిన డి.నళిని 112 మార్కులతో స్టేట్‌ టాపర్‌గా నిలిచారు. ఆమె తండ్రి శ్రీనివాసరావు, కుటుంబసభ్యులు అంతా వ్యవసాయదారులే. తాను భవిష్యత్‌లో వ్యవసాయ శాస్త్రవేత్త అవుతానని ఆమె తెలిపారు.

బయోటెక్నాలజీ విభాగంలో సోంపేట బనిశెట్టి వీధికి చెందిన దాసరి భవానీ శంకర్‌ 53 మార్కులతో స్టేట్‌ టాపర్‌గా నిలిచారు. తల్లిదండ్రులు దాసరి కృష్ణారావు, గోపి. విద్యార్థి డిప్లమో పూర్తి చేసి విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో కంచిలి మండలం జాడుపూడి సమీపంలోని బసవపుట్టుగకు చెందిన కె.శరత్‌కుమార్‌ 164 మార్కులతో స్టేట్‌ 9వ ర్యాంకు సాధించాడు. తండ్రి కండ్రెడ్డి రాజారావు ఎలక్ట్రీషియన్‌, తల్లి ఢిల్లమ్మ గృహిణి.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బూర్జ మండలం కంతలాంకు చెందిన కింజరాపు ప్రతాప్‌ 149 మార్కులతో స్టేట్‌ 6వ ర్యాంకు సాధించాడు. తండ్రి మురళి మృతి చెందడంతో తల్లి లత వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ చదివించారు.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బూర్జ మండలం పెద్దపేటకు చెందిన వి.మనోజ్‌కుమార్‌ 148 మార్కులు సాధించి స్టేట్‌లో 8వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. తండ్రి అనంతరావు వ్యవసాయ కూలి, తల్లి దశరత్నం గృహిణి.

● అదే విభాగంలో శ్రీకాకుళం రూరల్‌ మండలం వప్పంగిలోని గొండువీధికి చెందిన గొండు భానుప్రసాద్‌ 147 మార్కులతో 9వ ర్యాంకు సాధించాడు.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పొందూరు మండలం గోకర్నపల్లికి చెందిన శీపాన హేమప్రియ 101 మార్కులు సాధించి స్టేట్‌ 2వ ర్యాంకుతో సత్తాచాటింది. ఈమె తల్లి సీపాన జ్యోతి టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తండ్రి ప్రభాకరరావు మృతి చెందారు.

● అదే విభాగంలో సారవకోట మండలం నౌతలలోని పెద్దవీధికి చెందిన ఆర్‌.హేమలత 91 మార్కులతో స్టేట్‌ 7వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు సుధారాణి, డిల్లేశ్వరరావులు కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివించారు.

● జలుమూరు మండలం గొటివాడ గ్రామానికి చెందిన గురువు బాలకృష్ణ ఈసెట్‌లో మెకానికల్‌ విభాగంలో పదో ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు గౌరమ్మ, శ్రీనివాసరావులు వ్యవసాయ కూలీలు.

ఫార్మసీ విభాగంలో ఆమదాలవలసలోని ఐజే నాయుడుకాలనీకి చెందిన కూన భార్గవి 109 మార్కులతో స్టేట్‌ 3వ ర్యాంకు సాధించి శభాష్‌ అనిపించింది. తండ్రి నర్సింగరావు సాధారణ పనులు చేస్తూ పువ్వుల వ్యాపారం చేస్తుంటారు. తల్లి రమణమ్మ గృహిణి. ఈమె పెళ్లి చేసుకున్నాక చదువు కొనసాగిస్తున్నారు. ర్యాంకు సాధించేందుకు భర్త రమేష్‌కుమార్‌, అత్తమామలు సహకారం అందించారని తెలిపారు.

1

2

7

9

10

6

3

8

9

1621 మంది పరీక్ష రాయగా 92.97 శాతంతో 1507 మందికి అర్హత

ఈసారి బాలికలదే పైచేయి

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 1
1/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 2
2/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 3
3/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 4
4/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 5
5/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 6
6/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 7
7/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 8
8/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 9
9/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 10
10/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 11
11/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే.. 12
12/12

వివిధ కోర్సుల్లో టాపర్లు వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement