పట్టాలు తప్పిన పనులు..! | - | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన పనులు..!

May 18 2025 1:16 AM | Updated on May 18 2025 1:16 AM

పట్టా

పట్టాలు తప్పిన పనులు..!

చర్యలు తీసుకోవాలి

అండర్‌ టన్నల్‌ వే పనుల్లో నాణ్యతా లోపాలు కళ్లకు అద్దినట్లు కనిపిస్తున్నాయి. రైల్వేశాఖ అధికారులు పర్య వేక్షణ చేసి సంబంధిత గుత్తే దారులపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే మరి న్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

– సూర శ్యామ్‌కుమార్‌, కనుగులవలస గ్రామం

ఇబ్బందులను తొలగించాలి

అండర్‌ టన్నల్‌ వే నిర్మాణ పనులు పూర్తిచేసి నెలలు గడవకముందే రాళ్లు తేల డం దారుణం. అనేక మంది ద్విచక్ర వాహనదారులు బోల్తాపడి గాయపడుతున్నారు. వర్షం వస్తే నీరు నిల్వ అవుతుండడంతో ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇప్పటికై నా రైల్వేశాఖాధికారులు అండర్‌ టన్నల్‌ వే వద్ద నిర్వహణ చర్యలు తీసుకోవాలి.

– పి.రామేష్‌, ఆమదాలవలస

ఆమదాలవలస రూరల్‌:

రైల్వేశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా పనుల్లో డొల్లతనం కళ్లకు అద్దినట్లు కనిపిస్తోంది. అయినా రైల్వేశాఖ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తనట్లు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమదాలవలస మండలంలోని కనుగులవలస, పొందురు మండలంలోని పెనుబర్తి వద్ద జరిగిన అండర్‌ టన్నల్‌ వే నిర్మాణ పనులు అధ్వానంగా ఉన్నాయి. రైల్వేగేట్లు మూసివేసే ప్రాంతంలో రైల్వేశాఖ ఈ అండర్‌ టన్నల్‌ వే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. రైల్వేట్రాక్‌ కింద చేసిన నిర్మాణ పనులతో పాటు ఇరువైపులా చేపట్టిన నిర్మాణ పనులు కోసం ఒక్కో అండర్‌ టన్నల్‌ వేకు సంబంధించి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు రైల్వేశాఖ ఖర్చు చేసింది. అయితే నాణ్యతకు సంబంధించి అధికారులు పర్యవేక్షణ కరువవ్వడంతో పనులు పట్టాలు తప్పాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్‌లో తప్పని ముప్పు

రైల్వేగేట్లు బదులుగా ట్రాక్‌ కింద నుంచి పలు భారీ వాహనాలతో పాటు అనేక వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఈ అండర్‌ టన్నల్‌ వే పనులు రైల్వే శాఖ చేపట్టింది. రైల్వేశాఖకు సంబంధించి అండర్‌ టన్నల్‌ వే పైనున్న ట్రాక్‌ నుంచి నిత్యం అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత భారమైన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నందున రైల్వేశాఖ ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టినా నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. లేకుంటే రైలు ప్రమాదాలకు అవకాశాలు ఉంటాయని చెప్పడానికి ఇటీవల కాలంలో జరుగుతున్న రైలు ప్రమాదాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వాహనదారులకు ఇబ్బందులు

అండర్‌ టన్నల్‌ వే పనులు పూర్తిచేసి మూడు నెలలు గడవకముందే రాళ్లు తేలుతుండడంతో నిత్యం ప్రయాణాలు సాగిస్తున్న వాహనదారులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. టన్నల్‌ వే వద్ద రహదారి పై రాళ్లు తేలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక ద్విచక్ర వాహనాలు బోల్తాపడి పలువురు గాయాలబారిన ఇటీవల పడ్డారు. దీంతో అధికారులు ఇప్పటికై నా స్పందించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రైల్వే నిర్మాణ పనుల్లో నాణ్యత డొల్ల

అండర్‌ టన్నల్‌ వే పనుల పర్యవేక్షణ కరువు

నెలలు గడవక ముందే రాళ్లుతేలిన వైనం

వాహనదారులకు తప్పని తిప్పలు

పట్టాలు తప్పిన పనులు..!1
1/5

పట్టాలు తప్పిన పనులు..!

పట్టాలు తప్పిన పనులు..!2
2/5

పట్టాలు తప్పిన పనులు..!

పట్టాలు తప్పిన పనులు..!3
3/5

పట్టాలు తప్పిన పనులు..!

పట్టాలు తప్పిన పనులు..!4
4/5

పట్టాలు తప్పిన పనులు..!

పట్టాలు తప్పిన పనులు..!5
5/5

పట్టాలు తప్పిన పనులు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement