
సివిల్స్ ర్యాంకర్‌కు సత్కారం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం మట్టిలో పుట్టిన మాణిక్యం రావాడ సాయి మోహిని మానస అని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.ఆర్.రజినీ అన్నారు. సివిల్స్‌లో 975వ ర్యాంక్ సాధించిన రావాడ సాయి మోహిని మానసను ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్ దళిత, ఉద్యోగ, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ శ్రమ, పట్టుదల, నిరంతర అధ్యయనం, తల్లిదండ్రులు ప్రోత్సాహమే నా విజయానికి కారణమని చెప్పారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు రావాడ ప్రకాశ్, ఉషారాణి, రైల్వే అధికారి కుందన రామారావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, రిటైర్డ్ జైల్ శాఖ డీఎస్పీ బత్తిన కృష్ణారావు, డాక్టర్ జగదీష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల శాఖ అధికారి కంబాల రవిరాజా, అసోసియేషన్ నాయకులు బత్తిలి మురళీకృష్ణ, పొన్నాడ రుషి, రుంకు అప్పారావు, రుంకు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.