నేను కుందువానిపేట.. వింటారా నా మాట
ప్రియమైన పర్యాటకులకు..
మీ కుందువానిపేట సముద్ర తీరం..
ఆశీర్వదించి రాయు విన్నపం..
మీకు గుర్తుందో లేదో..
ఒకప్పుడు మీలో చాలా మంది నా ఒడిలో
ఆడుకునేవారు.
పొద్దు పోయే వరకు ఇక్కడే ముచ్చట్లాడుకునేవారు.
ఈ తీరాన ఉండే చిన్ని పాకల్లో చిరుతిళ్లు కొనుక్కుని ఇంటిల్లిపాదీ ఆనందించేవారు..
మీ ముఖాల్లో వెల్లివిరిసే సంతోషం చూసి నాకూ ముచ్చటేసేది..
కానీ ఏ దిష్టి తగిలిందో..
ఇప్పుడు నా వద్దకు రావడమే మానేశారు..
ఒక ఆదివారం కాకపోతే మరో వారమైనా వస్తారని ఎదురు చూస్తున్నాను..
కానీ ఎవరూ రావడం లేదు..
పోనీలే.. కార్తీకంలో వస్తారు అనుకునేదాన్ని..
కానీ నా అంచనా తప్పైపోయింది..
ఒకప్పుడు కళకళలాడిన ఈ పాకలు ఇప్పుడు కూలిపోయాయి..
స్వచ్ఛమైన నా ఇసుక తిన్నెల మధ్య ఏవేవో సీసా ముక్కలు గుచ్చుకుంటున్నాయి..
ఒకప్పుడు రాత్రి 8 గంటల వరకు నా ఒడిలో చాలా మంది సేదతీరేవారు..
కానీ ఇప్పుడు రాత్రయితే చాలు ఇటుగా
రావడానికే చాలా మంది
భయపడుతున్నారు..
విద్యుత్ బల్బులన్నీ పాడైపోయాయి..
అనాదిగా అందాలు పంచిన ఈ ప్రదేశం..
ఇప్పుడు అందవిహీనమవుతోంది..
ఇది నేను తట్టుకోలేకపోతున్నా..
నాకు మళ్లీ వెనకటి రోజులు కావాలి..
పిల్లలంతా నా ఒడిలో ఆడుకోవాలి..
మీరంతా ఉదయాస్తమయాలు ఇక్కడి నుంచి మళ్లీ ఆస్వాదించాలి..
ఆ పాకలన్నీ మళ్లీ కళకళలాడాలి..
సీసా ముక్కలు కనిపించని ఇసుక తిన్నెలు మిమ్మల్ని స్వాగతించాలి.
నా అలల ఘోషనే నా విన్నపంలా భావించండి..
నా కెరటాలు మీ కోసమే వస్తున్నాయని తెలుసుకోండి..
నా విన్నపాన్ని మన్నిస్తారని భావిస్తూ..
మీ
కుందువానిపేట సముద్ర తీరం
– శ్రీకాకుళం రూరల్
సచివాలయాలకు ఫైబర్ నెట్ కష్టాలు
సారవకోట: మండలంలో సచివాలయాలకు ఫైబర్ నెట్ కష్టాలు తప్పడం లేదు. సచివాలయాలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఏపీ ఫైబర్ నెట్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఫైబర్ నెట్‌వర్క్ గత కొన్ని రోజులుగా రాకపోవడంతో సచివాలయాల్లో ఆన్‌లైన్ పను లు చేసేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాళ్లు వారి సొంత మొబైల్స్‌కు వైఫై ద్వారా కంప్యూటర్లకు కనెక్ట్ చేసుకుని ఆన్‌లైన్ వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయా ల్లో కూడా ఈ ఏపీ ఫైబర్ నెట్ వినియోగిస్తుండటంతో వారు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నెట్‌వర్క్ వచ్చేటట్లు చూడా లని కోరుతున్నారు.
నేను కుందువానిపేట.. వింటారా నా మాట
నేను కుందువానిపేట.. వింటారా నా మాట
నేను కుందువానిపేట.. వింటారా నా మాట


