పనస రైతు ఆశలు చిగురించేనా..?
వజ్రపుకొత్తూరు: ఉద్దానం రైతులు పనసపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి ఇటు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ పనస పంటకు ఆలవాలం. ఉద్దానంలో ఈ పంటను మిశ్రమ పంటగా 7812 ఎకరాల్లో 5 లక్షల చెట్లు వరకు సాగు చేస్తున్నారు. ఈ చెట్ల నుంచి ఏడాదికి 1.50 లక్షల టన్నుల పచ్చి కా యలు దిగుబడికి వస్తాయి. ప్రస్తుతం చెట్లు పూత, పిందె దశలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో దిగుబడులు వస్తే గనక జిల్లా నుంచి మఖరాంపురం, హరిపురం, కంచిలి, పలాస, పూండి ప్రాంతాల నుంచి ఒడిశా, కోల్‌కత్తా, అస్సోం, వారణాశి, చత్తీస్‌గఢ్, బీహార్ తదితర రాష్ట్రాలకు తరలిస్తారు. రోజుకు 350 టన్నుల వరకు ఎగుమతి చేస్తారు. ఇక పోతే కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌కు సైతం ఉద్దానం పనస వెళ్తుంది. అక్కడ చిన్న తరహా పరిశ్రమల్లో చిప్స్, పకోడి ప్యాకెట్‌లుగా తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు.
యాజమాన్య పద్ధతులే కీలకం..
డిసెంబర్– జనవరి నెలల్లో పూత నుంచి పిందె దశ ప్రారంభమవుతుంది కాబట్టి ఆడ పుష్పాలు కొమ్మ, కాండంపై వస్తా యని ఉద్యానవన శాఖ అధికారి సీహెచ్ శంకర్‌దాస్ తెలిపారు. ప్రస్తుతం మంచు, చలి తీవ్రత అధికంగా ఉన్న నేప థ్యంలో పిందె, పువ్వు మధ్య నీరు నిల్వ
ఉండకుండా చూడాలన్నారు. ఈ సీజన్‌లో ఎస్‌ఏఏఎఫ్( సాఫ్) పౌడర్‌లో కార్బండిజమ్, మాంకోజెబ్ కలిపి లేకా డైతేన్ ఎం–45ను లీటరు నీటికి గ్రామున్నర కలిపి కాండం, పూత, పిందెలపై పిచికారీ చేస్తే మంచిదని సూచించారు. కొమ్ము, కాయతొలుచు పురుగు, పిండినల్లి ఆశించి ఎండు తెగులు సైతం సోకుతుంది కాట్టి నిత్యం క్షేత్ర సందర్శన చేయాలన్నారు.
మార్కెట్ లేక..
మన ఉద్దానంలో పండే పంటలకు మార్కెట్ కరువనే చెప్పాలి. రైతు కష్టం దళారుల భోజ్యం చేస్తున్నారు. తక్కువ ధర కట్టి ఎక్కువ లాభాలు ఆర్జించి ఈశా న్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కానీ వాటిని మార్కెట్ చేసి, ప్రాసెసింగ్ చేసే వ్యవసాయాధారిత పరిశ్రమలు మన రాష్ట్రంలో లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. చిప్స్, పకో డీ, పనస తాండ్ర లాంటి ఉత్పత్తులకు అవసరమైన కుటీర, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతులు లాభాలు ఆర్జించడమే కాకుండా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వర్షాలు అనుకూలించడంతో దిగుబడిపై అంచనాలు
జిల్లాలో 7812 ఎకరాల్లో మిశ్రమ పంటగా పనస
ఏటా రూ.1.50లక్షల టన్నుల దిగుబడి
మార్కెట్ లేక నష్ట పోతున్న రైతు
ఆధారిత పరిశ్రమలు కరువు
పనస రైతు ఆశలు చిగురించేనా..?


