దళిత వ్యక్తిపై దాడికి యత్నం
● మద్యం మత్తులో వాగ్వాదం చేసిన టీడీపీ వర్గీయులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని శ్రీశయన వీధి లో ఓ దళిత వ్యక్తిపై టీడీపీకి చెందిన రెడ్డి సూర్యనారాయణ మరికొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. స్థానికులు, బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. నూతలపాటి శరత్‌భూషణ్‌రాజు తన కుటుంబంతో కలసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి రెడ్డి సూర్యనారాయణ అనే టీడీపీ నాయకుడు మద్యం మత్తులో శరత్‌భూషణ్ ఇంటికి వెళ్లి ఇంటిముందున్న క్రిస్మస్ స్టార్ తీసేయాలని కులాన్ని దూషిస్తూ తీవ్ర పదజాలంతో తిట్టాడు. తీయనని చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వా దం జరిగింది. ఆపై తోసుకోవడం, శరత్‌భూషణ్ సూర్యనారాయణను చెంపదెబ్బ కొట్టడంతో గొడవ మరింత ముదిరింది. సూర్యనారాయణ అనుచరులు వచ్చి శరత్‌భూషణ్ తలపై, పొట్టపై పిడిగుద్దులు గుద్దడంతో కుటుంబ సభ్యు లు అతడిని రిమ్స్‌కు తరలించారు. ఈలోగా ఓ 20 మంది వరకు ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్న శరత్‌భూషణ్‌ను మంచంపైనుంచి కిందకు లాగేయడం, చంపుతామని బెదిరించడం వంటివి చేశారు. ఇదంతా అక్కడి సీసీ ఫుటేజీ నిక్షిప్తమైంది. ఎస్పీకి సైతం సమాచారం అందడంతో రెండో పట్టణ పోలీసులు అప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారు. ఇదే విషయమై రెండో పట్టణ పోలీసుల వద్ద ప్రస్తావించగా ఇంకా కేసు నమోదు చేయలేదన్నారు.
దళిత వ్యక్తిపై దాడికి యత్నం


