సంచలన హత్యలివే..
● మార్చి 3న నరసన్నపేట బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) అనే వృద్ధురాలిని వివస్త్రగా చేసి చెవి, ముక్కు కోసేసి దారుణంగా ఓ బాలుడు హత్య చేశాడు. అనంతరం బంగారం దోచుకుని పారిపోయాడు.
● జూన్ 9న కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురానికి చెందిన వృద్ధురాలు దుంపల దాలమ్మను ఇంట్లో మోటారు రిపేర్ చేసేందుకు అదే గ్రామానికి చెందిన బల్లి రాము వచ్చి ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో చనిపోయింది. బంగారు గొలుసుతో పరారయ్యాడు.
● డిసెంబరు 1న లావేరు మండలం మురపాకకు చెందిన వృద్ధురాలు వడ్డీ పార్వతి (64) 1న అదృశ్యమై 3న ఓ పాడుబడిన బావిలో శవంగా తేలింది. చెవి, ముక్కు కొరికి, కాల్చి హత్య చేసి బంగారం దోచుకెళ్లిన దుండగులు బావిలో పడేశారు.
● జూలై 11న ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సత్తారు గోపిని అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ఎన్‌హెచ్–16 సమీప కొయిరాలమెట్ట వద్ద దారుణంగా హత్యచేశారు.
● ఆగస్టు 26న నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు వెంకటపార్వతీశం గుప్తాను బంగారం కోసం డ్రైవర్ సంతోష్‌తో పాటు పెద్దపాడు వద్ద ఆదిత్య కార్‌వరల్డ్ బిల్డింగ్ యజమాని ఎం.అప్పలరాజు మెడకు తాడు బిగించి హత్య చేసి రామిగెడ్డలో మృతదేహాన్ని పడేశారు.
● సెప్టెంబరు 24న కంచిలి మండలం జలంత్రకోట సమీపంలో ఓ దాబాలో భోజనం చేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోతున్న లారీ డ్రైవర్‌ను ఓనర్ డబ్బులు అడగడంతో లారీతో తొక్కించి చంపేశాడు. అడ్డుకున్న మరో వ్యక్తిపైనా లారీ ఎక్కించేసి మరణానికి కారణమయ్యాడు.
● జనవరి 18న పొందూరు మండలం మొదలవలసకు చెందిన పూజారి కళావతి (53) శ్రీకాకుళం నగరం న్యూకాలనీలో హత్యకు గురైంది.
శ్రీకాకుళం క్రైమ్ :
ఏడాది కాలంగా జిల్లా వరుసగా హత్యలు చూస్తూనే ఉంది. గడిచిన ఏడాదిలో 16 హత్యలు జరిగాయని అధికారులు గణాంకాల్లో పేర్కొనగా ఈ ఏడాది చివరికొచ్చేసరికి దాదాపు 30 హత్యలు జరిగాయి. వీటిలో పోలీసులు ధ్రువీకరించినవి కొ న్ని మాత్రమే. కొన్నింటిని అనుమానాస్పద మరణాలుగా చూపారు. కానీ అవి కూడా హత్యలేనని స్థానికులు, కుటుంబీకుల నుంచి గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిలో 15 హత్యలు మహిళలకు సంబంధించినవే కావడం గమనార్హం.
ఎందుకీ నేర ప్రవృత్తి..?
రాజకీయ కారణాలు, మద్యం మత్తు, అనుమానం, దురాశ.. జిల్లాలో జరిగిన హత్యాకాండల వెనుక దాదాపుగా ఉన్న కారణాలివే. ఎక్కడికక్కడ మద్యం దొరుకుతుండడం, గంజాయి విక్రయాలు పెచ్చుమీరుతుండడంతో నేరాలూ పెరుగుతున్నాయి. మరోవైపు రాజకీయ కారణాలతోనూ చంపుకోవడం వంటి కొత్త సంస్కృతులు కూడా జిల్లాకు ఈ ఏడాదే పరిచయమయ్యాయి. ఇదివరకు దాడులు మాత్రమే జరిగాయి.. ఇప్పుడవి హత్యల స్థాయికి చేరుకున్నాయి.
భార్యాభర్తల తగాదాలు..
జనవరి 25న ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు గురుగుబెల్లి చంద్రశేఖర్ (45), ఫిబ్రవరి 10న సోంపేట మండలం జింకిభద్ర బీసీ కాలనీలో సాహుకారి రత్నాలు (70), ఫిబ్రవరి 24న జిల్లాకేంద్రంలోని టి–ఏజెంట్ కాలనీలో మజ్జి రమేష్‌నాయు డు (34), మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42), మార్చి 28న కవిటి మండలం ఆర్.కరాపాడులో గర్భిణి కొంతాల మీనాక్షి, ఏప్రిల్ 15న జి.సిగ డాం మండలం సంతవురిటికి చెందిన బాలబొమ్మ భవాని (21), మే 7న కోటబొమ్మాళిలో లేడీస్‌కార్నర్ షాపు నిర్వహిస్తున్న నర్సిపురం లక్ష్మి (30), నవంబరు 20న నందిగాం మండలం శివరాంపురానికి చెందిన పుష్పలత నౌపడ 3 రోడ్ల కూడలిలో హత్యలకు గురయ్యారు. వీరంతా వారి వారి భార్యలు, భర్తల చేతుల్లోనే మరణించారు.
వివాహేతర బంధాలు..
● ఏప్రిల్ 19న పైడిభీమవరం కాజావారి కోనేరు గట్టు వద్ద ఓ యువతి (23), మే 17న సోంపేట మండలం పాలవలసకు చెందిన వ్యక్తి, జూన్ 1న
అదే గ్రామానికి చెందిన మహిళ, ఆగస్టు 30న ఆమదాలవలస చంద్రయ్యపేటలో మహిళ(45) వివాహేతర బంధాలతోనే హత్యలకు గురయ్యారు. డిసెంబరు 2న శ్రీకాకుళం ఏఎస్‌ఎన్‌కాలనీకి చెందిన మహిళ(43) ఆస్పత్రికి వెళ్లి 2న అదృశ్యమై ఎచ్చెర్ల కేశవరావుపేట హైవే పక్కన 3న శవమైంది. వివాహేతర బంధమేనన్న చర్చ సాగుతుండగా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.
సొంత కుటుంబీకులే..
● జూన్ 17న ఇచ్చాపురం మండవల్లికి చెందిన బర్రి గంగయ్యను తన అల్లుడు పాతిర్ల జీవన్‌రెడ్డి (దాసు) నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు.
● అదే నెల 22న నందిగాం మండలం కామధేనుపురంకు చెందిన కిల్లి ధర్మారావు తన తమ్ముడు తవిటయ్యను గడ్డపారతో కొట్టి చంపేశాడు.
2025లో సిక్కోలును వణికించిన హత్యాకాండలు
ఏడాదిలో దాదాపు 30 హత్యలు
శాంతిభద్రతలను అదుపు చేయడంలో యంత్రాంగం విఫలం
సంచలన హత్యలివే..
సంచలన హత్యలివే..
సంచలన హత్యలివే..
సంచలన హత్యలివే..


