పెట్రోల్ బంక్ యజమానికి రూ.50వేలు అపరాధ రుసుం
మెళియాపుట్టి: చాపరలోని కృష్ణకామాక్షి ఫిల్లింగ్ స్టేషన్ (ఇండియన్ ఆయిల్) పెట్రోల్ బంక్ యజమానికి రూ.50వేలు అపరాధ రుసుం విధించినట్లు శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల జలక లింగుపురం గ్రామానికి చెందిన నడిమింటి ఉమాపతి అనే వ్యక్తి 40 లీటర్ల పెట్రోల్ కొట్టించాడు. అయితే చెల్లించిన సొమ్ము కంటే 4 లీట ర్ల పెట్రోల్ తక్కువగా వచ్చింది. దీంతో ఆయ న రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో తూనికలు కొలతల శాఖ అధికారులు పరిశీలించి జేసీకి నివేదించారు. అందులో భాగంగానే ఈ అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు.
ఉత్సాహంగా ఓపెన్ చెస్ టోర్నీ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి ఓపెన్ ఫెస్టివల్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురం ప్రాంతంలో గల తిలక్‌నగర్ నర్సెస్ కాలనీలోని స్కూల్ ఆఫ్ చెస్ ఆకాడమీలో క్రిస్మస్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని ఆదివారం 209వ చెన్ టోర్నీని నిర్వహించారు. ఐదు రౌండ్ల పాటు జరిగిన చెస్ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి చెస్ క్రీడాకారులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్, సంజీవయ్య మెమోరియల్ ట్రస్టు ప్రెసిడెంట్ డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా మాట్లాడుతూ నిరంతరం చెస్ క్రీడ సాధనతో మెదడు పదునెక్కుతుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలు, సర్టిఫికెట్లు, బహు మతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ కోచ్ భేరి చిన్నారావు, చెస్ కోచ్ కె.సాయినిరంజన్ సింగ్, చెస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
‘కళారంగాన్ని కాపాడుకోవాలి’
కొత్తూరు: సమాజంలో అంతరించిపోతున్న కళారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజ లు, ప్రభుత్వాలపై ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు అన్నారు. కొత్తూరు మండలం మెట్టూరు బిట్–3 ఆర్‌ఆర్ కాలనీలో గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా కొత్తూరు మండలం గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో కళాపీఠం అధ్యక్షుడు గేదెల సుందరనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముందుగా గుర్రం జాషువా చిత్రపటం వద్ద యడ్ల గోపాలరావు, ప్రముఖ కళాకారురాలు మంగమ్మ, సర్పంచ్ కొయిలాపు శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు. హరికథలు, బుర్రకథలు వంటివి రామాయణ భారతాల్లోని ధర్మాన్ని సామాన్యులకు వివరిస్తాయ ని తెలిపారు. సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుర్రం జాషువా కళారంగానికి చేసిన సేవలను వివరించారు. ఈ సందర్భంగ అఖిల ప్రజా కఽళాకారుల సంక్షేమ సంఘం(ఏపీకేఎస్‌ఎస్) 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
పెట్రోల్ బంక్ యజమానికి రూ.50వేలు అపరాధ రుసుం
పెట్రోల్ బంక్ యజమానికి రూ.50వేలు అపరాధ రుసుం


