వైఎస్సార్ సీపీ అభిమానిపై దాడి
గార: మండలంలోని వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని కంచు మధుసూదనరావుపై స్థానిక టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయాలపాలయ్యారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. కంచు మధు ఓ ప్రైవేటు స్కూల్‌లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సెలవు కావడంతో ఆదివారం మధ్యాహ్నం ఇంటి బయట కూర్చుని ఉండగా స్థానికుడు శిమ్మ నవీన్‌తో మరో వ్యక్తి కవ్వించారు. అయినా పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత చల్ల ప్రభాకర్, శిమ్మ గోవింద, శిమ్మ చంద్రశేఖర్, శిమ్మ ఆనంద్, శిమ్మ సోమేష్ అనే వ్యక్తు లు వచ్చి మధుసూదనరావుపై ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి చేశా రు. దీంతో ఆయన స్పృహ కోల్పోయారు. ఆయన చిన్నాన్న వచ్చి 108లో మధుసూదనరావును రిమ్స్‌కు తరలించారు. వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో తన ఫొటో ఉందని, అందుకే కక్ష కట్టి దాడి చేశాడని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సీహెచ్ గంగరాజు తెలిపారు.


