
9 మంది పేకాటరాయుళ్లపై కేసు
గార: మండలంలోని పూసర్లపాడులో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని గార ఏఎస్‌ఐ ఎం.చిరంజీవి తెలిపారు. బుధవారం గ్రామ సమీపంలోని తోటల్లో ఆడుతున్న వీరిని టాస్క్‌ఫోర్సు పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి రూ.10,620 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
20న అఖిల భారత సమ్మె
రణస్థలం: కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణ కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న నిర్వహించనున్న అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం రణస్థలంలో సీఐటీయూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం పెంచాలని, కనీస పెన్షన్ రూ. 9వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశ తదితర స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని, పని భారం తగ్గించాలని కోరారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు కె.సుజాత, పెద్దింటి కాంతమ్మ, ఎన్.జయలక్ష్మి, బి.గౌరి, కెల్ల ఉషా, ఎం.అన్నపూర్ణ, ఎ.అరుణ పాల్గొన్నారు.