
నరసన్నపేట: కోమర్తి వద్ద జాతీయ రహదారి ఫ్లై ఓవరుపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి ఏమీ చెప్పలేని స్థితిలో ఉండటంతో మృతుడి పూర్తి వివరాలు తెలియలేదు. నరసన్నపేట వైపు నుంచి శ్రీకాకుళం వెళ్లే దారిలో వీరి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు ప్రమాద సంఘటన బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే ప్రదేశంలో వద్ద ఇసుక ఉండటంతో ఇసుక ట్రాక్టర్ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన ద్విచక్రవాహనంపై ఓడీ 33ఏ డీ2053 నంబరు ఉంది. దీంతో ప్రమాదానికి గురైన వారు ఒడిశావాసులుగా పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
సర్పాల సయ్యాట
పొందూరు రూరల్ : మండల కేంద్రం పొందూరులోని అఫీషియల్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి బేత కృష్ణారావు ఇంటి పక్కన సోమవారం సాయంత్రం నాగుపాము, జెర్రిపోతులు సయ్యాట ఆడాయి. ఒక్కసారిగా పాములు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.