
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చున్నాక రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జె న్సీ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. గత రెండు వా రాలుగా లిక్కర్ స్కామ్ అంటూ ఎల్లోమీడియాలో హోరెత్తిస్తున్నారని, ఆ పేరుతో మాజీ ఐఏఎస్‌లు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ హ యాంలో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మద్యం షాపులు ప్రభుత్వమే నడిపించిందన్నారు. విక్రయాలు తగ్గిస్తే స్కామ్ ఎలా సాధ్యమవుతుందన్నారు. ఆయన సోమవారం శ్రీకాకుళంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చి విలేకరులతో మాట్లాడారు. కూటమిలో స్కామ్‌లు జరుగుతున్నాయో, వైఎస్సా ర్‌సీపీ జరిగియో ప్రజలందరికీ తెలుసన్నారు. పలాసలో ఎమ్మెల్యే శిరీష ప్రత్యేకంగా ఒక్కో బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది అనుమానంగా ఉందన్నారు. మాజీ ఎంపీ నందిగామ సురే ష్‌ను అన్యాయంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పీఎస్‌ఆర్ ఆంజనేయుల్ని సైతం అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
పెట్టుబడులన్నీ వైఎస్సార్‌సీపీ హయాంలో వచ్చినవే..
రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వచ్చేవారిని సైతం కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు బ్లాక్‌మెయిల్ చేసి కమీషనర్లకు కక్కుర్తి పడుతున్నారని సీదిరి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వ హయాంలోనే పెట్టుబడులు వచ్చాయని, ఆ సమయంలోనే భూమి సేకరించి, ఆ సమయంలో ఎంఓయూలు తెచ్చుకున్నారని వివరించారు. రి న్యూ కంపెనీ, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ, శ్రీసిటీ, గ్రీన్ ఎనర్జీ కంపెనీలన్నీ వైఎస్ జగన్ హయాంలో వచ్చినవేనని గుర్తు చేశారు. టీసీఎస్ కంపెనీని కూడా వైఎస్ జగన్ తీసుకువచ్చారని, అన్ని రకాల పూర్తి చేస్తే కూటమి నాయకులు గొప్పలు చెప్పు కుంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఒక్కో యూనిట్ రూ 2.50కి కొనుగోలు చేస్తేనే స్కామ్ అన్నారు, ఇప్పుడు రూ.4.50 కొనుగోలు చేస్తున్నారు దీనిలో ఎంత స్కామ్ ఉంటుందో చెప్పాలని ప్రశ్నించారు. స్కామ్‌లు చేసే చంద్రబాబుకి అన్నీ స్కామ్‌లుగా కనిపిస్తాయన్నారు. తిరుపతిలో, సింహాచలంలో ఇలా అనేక దేవాలయాల్లో మృతి చెందుతున్న సంఘటనలు చూస్తే రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం చంద్రబాబు చేసిన పాపమే ప్రజలకు శాపంగా మారిందన్నారు.
మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ల అరెస్ట్‌లు అప్రజాస్వామికం
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు