
ఉపాధిలో జియో ట్యాగింగ్ కీలకం
మెళియాపుట్టి: ఉపాధి హామీ పథకంలో జియో ట్యాగింగ్ విధానం కీలకమైనదని, దానికి అనుగుణంగా పనులు నిర్వహించాలని జలశక్తి అభియాన్ కేంద్ర నోడల్ అధికారి వి.సుగుణాకరరావు అన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి మెళియాపుట్టి వచ్చిన ఆయన స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో నిర్మించిన రూఫ్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భజలాల పరిరక్షణ ఇటువంటి నిర్మాణాలు మరిన్ని చేపట్టాలన్నారు. అనంతరం గోకర్ణపురంలో పంట కుంటను పరిశీలించారు. అంతకుముందు స్థానిక ఉపాధి కార్యాలయంలో సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా జీఐఎస్ అధికారి శోభ, ఏపీఓ రవి, ఈసీ ఆదినారాయణ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు తిరుపతిరావు, రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.