
ప్రయాణికులతో కాంప్లెక్స్ కిటకిట
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బుధవారం ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించింది. బుధవారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అమ్మవారి పండగలు కావడంతో వాటికి హాజరయ్యేందుకు దూరప్రాంతాలు నుంచి ప్ర యాణికులు రాకపోకలు సాగించారు. అయితే రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రధానంగా సాలూరులో అమ్మవారి పండగలు జరుగుతుండడంతో అక్కడకు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి సగానికి పైగా బస్సులు వెళ్లిపోవడంతో స్థానికంగా కొరత ఏర్పడింది. కొత్తూరు, బత్తిలి, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో విపరీతమైన రద్దీ కనిపించింది.

ప్రయాణికులతో కాంప్లెక్స్ కిటకిట