ఆకాశవాణి ఏ–గ్రేడ్‌ ఆర్టిస్ట్‌గా సత్యవరప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

ఆకాశవాణి ఏ–గ్రేడ్‌ ఆర్టిస్ట్‌గా సత్యవరప్రసాద్‌

May 15 2025 1:14 AM | Updated on May 15 2025 1:14 AM

ఆకాశవ

ఆకాశవాణి ఏ–గ్రేడ్‌ ఆర్టిస్ట్‌గా సత్యవరప్రసాద్‌

కవిటి: బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో మృదంగం విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ బొంతలకోటి సత్యవరప్రసాద్‌ ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం ఇటీవల నిర్వహించిన ఆడిషన్‌లో ఏ–గ్రేడ్‌ ఆర్టిస్ట్‌గా అర్హత సాధించారు. ఈ మేరకు హైదరాబాద్‌ ఆకాశవాణి కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయని సత్యవరప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం కవిటి మండలం కుసుంపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

నారాయణపురం ఆయకట్టుకు నిధులు మంజూరు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఖరీఫ్‌లో సాగునీటి సమస్య పరిష్కారానికి నారాయణపురం ఆయకట్టుకు రూ.34.63 లక్షల నిధులను జలవనరులు శాఖ అధికారులు మంజూరు చేశారు. జంగిల్‌ క్లియరెన్స్‌, ఇసుక పొరల తొలగింపు, షట్టర్లు, మదుముల మరమ్మతులకు ఈ నిధులు వినియోగిస్తారు. సజావుగా సాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇసుక వాహనాలు సీజ్‌

కొత్తూరు: మండలంలోని అంగూరు ఇసుక ర్యాంపు(ఆకులతంపర) వద్ద బుధవారం జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నట్లు తహశీల్దార్‌ కె.బాలకృష్ణ తెలిపారు. నది మధ్యలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ప్రొక్లెయిన్‌, జేసీబీ, లారీలు, ట్రిప్పర్లు మొత్తం ఆరు వాహనాలు సీజ్‌ చేసినట్లు చెప్పారు.

ఉపాధి వేతనదారుడికి పాముకాటు

మెళియాపుట్టి: మండలంలోని చాపర పంచాయతీలో పరిధిలో బుధవారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా డోల అప్పడు అనే 60 ఏళ్ల వృద్ధుడు పాముకాటుకు గురయ్యాడు. వెంటనే తోటి వేతనదారులు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సింహాచలంకు తెలియజేయడంతో హుటాహుటిన పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

కాశీబుగ్గ/ఇచ్ఛాపురం : ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సుర్లారోడ్డు రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జి.ఆర్‌.పి. పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్‌ తెలిపారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఇచ్చాపురం–సుర్లారోడ్డు రైల్వేస్టేషన్ల మధ్య ఎగువ లైనులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. మృతుడి వయసు 55–60 ఏళ్లు ఉండవచ్చని, కాషాయ రంగు టీషర్టు, ఆకుపచ్చ లుంగీ ధరించి ఉన్నాడని, చేతి కర్ర, సంచి ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 94406 27567 నంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు.

మద్యానికి బానిసై

వ్యక్తి ఆత్మహత్య

ఎచ్చెర్ల క్యాంపస్‌ : మద్యానికి బానిసై చిలకపాలెం గ్రామానికి చెందిన సారిపల్లి జనార్దన్‌ (31) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనార్దన్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. భార్య ధనలక్ష్మి, కుమారుడు ఉన్నారు. జనార్దన్‌ రోజు సంపాదన మొత్తం మద్యం తాగేందుకే ఖర్చు చేస్తుండటంతో కొన్నాళ్గుఆ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల క్షయ వ్యాధి రావటంతో మందులు వాడుతున్నాడు. అయినా మద్యం ఆపకపోవడంతో భార్య ధనలక్ష్మి గొడవపడి బుధవారం శ్రీకాకుళంలో షాపులో పనికి వెళ్లిపోయింది. మనస్థాపానికి గురైన జనార్దన్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన భార్య భర్త మృతి చెందిన విషయం గమనించి ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

55 పశువులు పట్టివేత

రణస్థలం: రణస్థలం మండల కేంద్రంలో రామతీర్థాలు కూడలి వద్ద జాతీయ రహదారిపై ఐదు బొలెరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 55 పశువులను జె.ఆర్‌.పురం పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల నుంచి విశాఖపట్నం గోవధశాలకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసు నమోదు చేశారు. పశువులను విజయనగరం జిల్లా గుజ్జంగివలసలోని గో–సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు జె.ఆర్‌.పురం ఎస్సై ఎస్‌.చిరంజీవి తెలిపారు.

ఆకాశవాణి ఏ–గ్రేడ్‌ ఆర్టిస్ట్‌గా సత్యవరప్రసాద్‌ 1
1/2

ఆకాశవాణి ఏ–గ్రేడ్‌ ఆర్టిస్ట్‌గా సత్యవరప్రసాద్‌

ఆకాశవాణి ఏ–గ్రేడ్‌ ఆర్టిస్ట్‌గా సత్యవరప్రసాద్‌ 2
2/2

ఆకాశవాణి ఏ–గ్రేడ్‌ ఆర్టిస్ట్‌గా సత్యవరప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement