
క్యాట్ ఫలితాల్లో జయశంకర్ ప్రతిభ
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని బి.ఆర్.నగర్‌కు చెందిన యజ్జల జయశంకర్ కృష్ణ ఇటీవల వెలువడిన క్యాట్(సీఏటీ) ఫలితాలలో జాతీయ స్థాయిలో ఆరో స్థానం సాధించి ప్రతిష్టాత్మకమైన ఐఐఎం (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) ముంబై క్యాంపస్‌లో సీటు సాధించాడు. ఈ యువకుడు ఆంధ్ర యూనివర్సిటీలో 2024లో బీటెక్ డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడై ఫెడరల్ బ్యాంకులో ఉద్యోగానికి సైతం ఎంపికయ్యాడు. అయితే ఐఐఎంలో చదవాలనే కోరికతో ఉద్యోగాన్ని వదులుకుని, తాజాగా సీటు సాధించినట్లు తెలిపాడు. తండ్రి వరప్రసాదరావు పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో గ్రేడ్ –1 ఈఓగా, తల్లి ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.
దివ్యాంగులకు
ఉపాధి కల్పనపై దృష్టి
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి 12 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మూడో శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఎల్‌ఎన్‌వీ శ్రీధర్ రాజా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిత, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సుధా, బీసీ కార్పొరేషన్ అధికారి గడ్డెమ్మ, విభిన్న ప్రతిభావంతులు శాఖ ఏడీ కె.కవిత తదితరులు పాల్గొన్నారు.

క్యాట్ ఫలితాల్లో జయశంకర్ ప్రతిభ