
● కూలిన పశువుల శాల
ఎల్.ఎన్.పేట: మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి అపార నష్టం చోటు చేసుకుంది. చింతలబడవంజ గ్రామానికి చెందిన సనపల నారాయణరావు ఇంటి ముందు ఉన్న పశువుల శాలపై పిడుగు పడడంతో గోడలతో పాటు పైకప్పు రేకులతో పాటు కూలిపోయింది. ఆ సమయంలో శాలలో పాడి పశువులు లేకపోవటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మల్లికార్జునపురం వద్ద అలికాం–బత్తిలి (ఏబీ) రోడ్డు పక్కనున్న చెట్టు కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. కొమ్ములు పడిన కొంత సమయం తర్వాత స్థానికులు కొమ్మలు తొలగించే పనులు చేపట్టారు.
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సిక్కోలు వాతావరణం భయపెడుతోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గాలివాన దుమారం ఊళ్లకు ఊళ్లను చుట్టేసింది. గాలుల ధాటికి మామిడి కాయలు ఎక్కువ సంఖ్యలో రాలిపోయాయి. మొక్కజొన్న, బొప్పాయి, జీడి మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస ప్రధాన మార్గంలో కల్వర్టు పనులు జరుగుతున్నందున పెద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాగోలు దాటి న తర్వాత పెట్రోల్ బంకు దగ్గరలో, కొత్త రోడ్డు ముందు చర్చి దగ్గరలో వాహనాలు కిలోమీటరు పొడవున నిలిచిపోయాయి.
శ్రీకాకుళంలోని కృష్ణాపార్కు కూడలి వద్ద పరిస్థితి
● జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు ● నేలకూలిన విద్యుత్‌స్తంభాలు ● వణికించిన పిడుగుపాట్లు