
ఇచ్చట.. సునాయాసంగా.. కబళిస్తున్నారు
● జిల్లాలో భారీగా ఇసుక దోపిడీ
● ఉచితం ముసుగులో ఇసుక స్వాహా
● నకిలీ డివైజ్‌లతో బిల్లులు సృష్టిస్తున్న వైనం
● తాజాగా పైడిభీమవరంలో బయటపడిన నకిలీ బిల్లులు
ఈ ఫొటోలో ఉన్న లారీలను చూడండి. నకిలీ బిల్లులతో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డాయి. పైడి భీమవరం చెక్ పోస్టు వద్ద సోమవారం అర్ధరాత్రి దాటాక ఆకస్మిక తనిఖీలు చేయగా, నకిలీ బిల్లులని అనుమానంతో లారీలను పోలీసు అధికారులు నిలిపేశారు. పట్టుకున్న లారీలను మైనింగ్ అధికారులకు పోలీసులు అప్పగించారు.