
● అమరజవాన్‌కు నివాళి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వీర జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని ఎవరూ మరువలేరని వైఎస్సార్‌సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆర్మీ జవాన్లకు ప్రభుత్వ పరిహారం కింద రూ.50లక్షలు ఇచ్చే సంప్రదాయాన్ని వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ తరఫున రూ.25 లక్షలు ఇవ్వడం అభినందనీయమన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. పార్టీ కార్యాలయంలో మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.