● ఈ ఏడాది బీసీ, ఈబీసీ రుణాలకు బ్రేక్‌ ● నిధుల్లేక ఎక్కడికక్కడ ఆపేయమన్న ప్రభుత్వం ● తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రుణాల జోలికెళ్లొద్దని మౌఖిక ఆదేశం ● వెనకబడిన వర్గాలకు మరోసారి నిరాశ | - | Sakshi
Sakshi News home page

● ఈ ఏడాది బీసీ, ఈబీసీ రుణాలకు బ్రేక్‌ ● నిధుల్లేక ఎక్కడికక్కడ ఆపేయమన్న ప్రభుత్వం ● తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రుణాల జోలికెళ్లొద్దని మౌఖిక ఆదేశం ● వెనకబడిన వర్గాలకు మరోసారి నిరాశ

May 18 2025 1:05 AM | Updated on May 18 2025 1:05 AM

● ఈ ఏ

● ఈ ఏడాది బీసీ, ఈబీసీ రుణాలకు బ్రేక్‌ ● నిధుల్లేక ఎక్కడ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

వెనకబడిన వర్గాలకు మరోసారి నిరాశ తప్పలేదు. బీసీ, ఈబీసీల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మరో ఏడాది తాత్సారం చేసే పరిస్థితి కనిపిస్తోంది. సబ్సిడీ కింద మంజూరు చేయాల్సిన నిధుల్లేక.. అవసరం మేరకు నిధులు విడుదల చేయలేక ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను ఎక్కడికక్కడ ఆపేయాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు చర్యలు చేపట్టొద్దని సూచనప్రాయంగా చెప్పింది. ఇప్పటికే అరకొర యూనిట్ల కేటాయింపు, ఆపై నేతల జోక్యంతో తలలు పట్టుకుంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇవ్వడంతో కొన్నాళ్లు ఒత్తిళ్లు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు.

మాటలే..

చేతల్లేవ్‌..

రాష్ట్రంలో అత్యంత వెనకబడిన జిల్లా.. 90 శాతం మేర వెనుకబడిన వర్గాలు ఉన్న ప్రాంతం శ్రీకాకుళం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని.. ఆలోపు రూ.3వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని ఎన్నికల వేళ ప్రగల్బాలు పలికిన కూటమి నాయకులు పదవిలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేశారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పక్కన పెడితే విధిగా ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలనూ ఎగ్గొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే వెనకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలిస్తామని తొలుత హడావుడి చేశారు. దరఖాస్తులు ఆహ్వానించినప్పటికీ.. బ్యాంకు అధికారులు, ఇతర శాఖల అధికారులతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలే ఫైనల్‌ చేసే పరిస్థితి ఏర్పడింది.

భారీగా దరఖాస్తులు..

అరకొరగా యూనిట్లు..

జిల్లాలో ఎక్కువగా వెనకబడిన వర్గాల వారే ఉన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా మనకే అధికంగా రుణ యూనిట్లు కేటాయించాలి. కానీ, ప్రభుత్వం కేవలం 3,144 యూనిట్లే కేటాయించింది. 50 శాతం సబ్సిడీతో ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి, ఈ యూనిట్లు ఎటూ సరిపోవు. కానీ, తక్కువ యూనిట్లు కారణంగా ప్రభుత్వం దరఖాస్తుల సమయంలోనే అనేక ఆంక్షలు పెట్టింది. చివరికి 22,822 మంది దరఖాస్తు చేసుకోగలిగారు. వారందరికీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. తుది ఎంపిక మాత్రం ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయింది.

అధికారులపై ఒత్తిళ్లు..

ప్రభుత్వం కేటాయించిన 3144 యూనిట్లకు గాను సబ్సిడీ కింద సుమారు రూ.60 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఒక్క రూపాయీ విడుదల చేయలేదు. సబ్సిడీ నిధులు రాకపోవడంతో బ్యాంకులు ముందుకు రాలేదు. బీసీ కార్పొరేషన్‌ అధికారులు సైతం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈలోపు దరఖాస్తుదారుల నుంచి ఒత్తిళ్లు, నేతల నుంచి సిఫార్సుల తాకిడి పెరగడంతో ఉక్కిరిబిక్కిరియ్యారు. చివరికి ప్రభు త్వం సబ్సిడీ నిధులు ఇచ్చాక చూసుకుందామనే ఆలోచనకు వచ్చేశారు.

నిధుల్లేక రుణాలకు బ్రేక్‌..

తాజాగా రుణాల మంజూరు విషయంలో ముందుకెళ్లొద్దని ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఎక్కడికక్కడ ఆపేయాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. సబ్సిడీ కింద నిధులు విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో పాటు అరకొర యూనిట్లతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది బీసీ, ఈబీసీలకు రుణాలు వస్తాయా? అన్న దానిపై సందేహాలు కమ్ముకున్నాయి.

● ఈ ఏడాది బీసీ, ఈబీసీ రుణాలకు బ్రేక్‌ ● నిధుల్లేక ఎక్కడ1
1/3

● ఈ ఏడాది బీసీ, ఈబీసీ రుణాలకు బ్రేక్‌ ● నిధుల్లేక ఎక్కడ

● ఈ ఏడాది బీసీ, ఈబీసీ రుణాలకు బ్రేక్‌ ● నిధుల్లేక ఎక్కడ2
2/3

● ఈ ఏడాది బీసీ, ఈబీసీ రుణాలకు బ్రేక్‌ ● నిధుల్లేక ఎక్కడ

● ఈ ఏడాది బీసీ, ఈబీసీ రుణాలకు బ్రేక్‌ ● నిధుల్లేక ఎక్కడ3
3/3

● ఈ ఏడాది బీసీ, ఈబీసీ రుణాలకు బ్రేక్‌ ● నిధుల్లేక ఎక్కడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement