
ముగిసిన అంత్యక్రియలు
శ్రీకాకుళం రూరల్: గురజాడ విద్యాసంస్థల్లో మూడు దశాబ్ధాలుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పులఖండం శ్రీనివాసరావు అంత్యక్రియలు మంగళవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడుతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఒక సాహితీవేత్తను, పరిపాలన దక్షుడిని కోల్పోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. వీరితో పాటు విద్యాసంస్థల డైరక్టర్ రంగారావు, వి.మహేష్, ఐక్యూ ఏసీ మర్తాండ తదితరులు సంతాపం ప్రకటించారు.