రైతు రుణాలకు.. ముప్పుతిప్పలు | - | Sakshi
Sakshi News home page

రైతు రుణాలకు.. ముప్పుతిప్పలు

May 16 2025 12:22 AM | Updated on May 16 2025 12:22 AM

రైతు

రైతు రుణాలకు.. ముప్పుతిప్పలు

● అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తేనే రెన్యువల్‌ సాధ్యమంటున్న బ్యాంకర్లు ● రెన్యువల్‌ కాకుంటే జీరోవడ్డీ దక్కదేమోనని ఆందోళనలో అన్నదాతలు ● కూటమి ప్రభుత్వంలో నిబంధనలపై మండిపాటు

ఇదీ పరిస్థితి..

2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 4,10,847 మంది రైతులకు రూ.5246.55 కోట్లు పంట రుణాలుగా అందించాలని లక్ష్యం కాగా రూ.5054కోట్లు మంజూరు చేశారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తీసుకున్న ఈ పంట రుణాల రెన్యువల్‌ ప్రక్రియలో తీసుకున్న అసలుతో పాటు వడ్డీ రూ.50 కోట్ల వరకు రైతులు చెల్లించాల్సిన పరిస్థితి.

గత ప్రభుత్వంలో సాఫీగా ప్రక్రియ..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు ప్రతి ఏటా రైతు భరోసా పథకం ఠంచన్‌గా అందేది. పంట రుణాల రెన్యువల్‌ సమయంలోనూ వడ్డీ కడితే రెన్యువల్‌ సులభంగా జరిగిపోయేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పంట రుణం గుదిబండగా మారింది. ఏడాది లోపల రెన్యువల్‌ చేసుకోకపోతే పెనాల్టీ వడ్డీ కట్టుకోవాలి. ఫలితంగా జీరో వడ్డీ పథకం వర్తించదు. దాంతో పాటు సదరు రైతు డిఫాల్టర్‌గా మారి సివిల్‌ రేటింగ్‌ దెబ్బతింటుంది. ఇప్పటిౖకైనా ప్రభు త్వం స్పందించి రైతు రుణాల మంజూరు విషయంలో ఇబ్బందులు తొలగించాలని రైతులు కోరుతున్నారు.

కవిటి:

రీఫ్‌ సీజన్‌ ఆరంభం కాకముందే అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. పంట రుణాల రెన్యువల్‌ కోసం బ్యాంకులకు వెళుతున్న రైతులకు ఊహించ ని షాక్‌లు ఎదురవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వ హయాం 2024 మార్చి 31 వరకు లేని ఆంక్షలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా మాదిరిగానేవడ్డీ చెల్లించి రెన్యువల్‌ చేసుకుందామని బ్యాంకులకు వెళ్లిన రైతులకు అలా కుదరదంటూ బ్యాంకర్లు చెబుతున్నారు. అసలు, వడ్డీ రెండూ కడితేనే రెన్యువల్‌ చేస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో ఉసూరుమంటూ రైతులు వెనుతిరుగుతున్నారు. గత్యంతరం లేక వడ్డీ వ్యాపారులను అప్పుల కోసం ప్రాధేయపడుతున్నారు. వారం పది రోజులకు నూటికి రూ.3 నుంచి రూ.5ల వరకు వడ్డీకి తీసుకొ ని ఆ సొమ్మును బ్యాంకులకు కడుతున్నారు. పోనీ కట్టిన వెంటనే డబ్బులు ఇస్తున్నారంటే అది లేదు. బ్యాంకులో ఆ సొమ్ము ఒకరోజు క్రెడిట్‌గా ఉంచాల్సి ఉంటుందని, డబ్బుల కోసం మరుసటి రోజు రావా లని బ్యాంకర్లు సూచిస్తున్నారు. దీనికితోడు రుణం డబ్బులు విత్‌ డ్రా చేయడానికి చెక్‌బుక్‌ అవసరమని చెబుతుండడంతో దానికీ తిప్పలు తప్పడం లేదు. బ్యాంకు నుంచి రూ.49,000 పైబడి డబ్బులు తీసుకోవడానికి పాన్‌కార్డు కూడా ఉండాలని చెబుతుండటంతో ఇవేం పాట్లు అంటూ ఆవేదన చెందుతున్నారు.

రైతు రుణాలకు.. ముప్పుతిప్పలు 1
1/1

రైతు రుణాలకు.. ముప్పుతిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement