
21,572
● 56 కేంద్రాలు..
మంది విద్యార్థులు
శ్రీకాకుళం న్యూకాలనీ:
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో సోమవారం నుంచి మొదలుకానున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్ష కేంద్రాలకు మెటీరియల్స్‌ను చేరవేశారు. మార్చిలో రాసిన పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు ప్రథమ సంవత్సరంలో మార్కులు పెంచుకునేందుకు (ఇంప్రూవ్‌మెంట్/బెటర్‌మెంట్) మరికొంతమంది విద్యార్థులు ఈ పరీక్షలను రాస్తున్న విషయం తెలిసిందే. మొత్తంమీద ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల నుంచి 21,572 మంది విద్యార్థులు ఫీజులను చెల్లించారు. పరీక్షల కోసం 56 కేంద్రాలను కేటాయించారు. వీటిలో ప్రభుత్వ యాజమాన్య కళాశాలలే అధికంగా ఉన్నాయి.
అధికారులు, సిబ్బంది నియామకం పూర్తి..
పరీక్షల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించారు. మూడు ఫ్లయింగ్, 6 సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్/డీవీఈఓ ఆర్.సురేష్‌కుమార్, ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు, డీఈసీ కమిటీ సభ్యులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్‌ను సిద్ధం చేశారు. సీసీ కెమెరాలను ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేసి అమర్చారు.
రెండు సెషన్స్‌లలో పరీక్షలు..
సప్లిమెంటరీ పరీక్షలను రెండు సెషన్లుగా నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు అర్ధగంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిర్ణీత సమయానికి హాజరుకాకుంటే.. పరీక్ష కేంద్రంలోపలకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 144 సెక్షన్ పక్కాగా అమలయ్యేందుకు, పరీక్ష కేంద్రాల వద్ద పహారా కాసేందుకు పోలీసు సిబ్బందిని నియమించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధించారు. ఇన్విజిలేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 10 ప్రత్యేక రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.
నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్
సప్లిమెంటరీ పరీక్షలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన యంత్రాంగం
ఎండల నేపథ్యంలో సౌకర్యాలు..
మండే ఎండల నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులు, కలెక్టర్ సూచనల మేరకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్, మెడికల్ కిట్లతో మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లను బీఐఈ.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్‌పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. – ప్రగడ దుర్గారావు,
ఆర్‌ఐఓ/డీఈసీ కమిటీ కన్వీనర్

21,572

21,572