
కులమతాల అడ్డుగోడలు పోవాలి
● సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
శ్రీకాకుళం కల్చరల్: కులమతాల అడ్డుగోడలు పోవాలని, దాని వల్ల ఎదగలేకపోతున్నామని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అభిప్రాయపడ్డారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో సుద్దాల అశోక్ తేజ రచించిన శ్రీశూద్రగంగ కావ్యగాన కార్యక్రమం శ్రీకాకుళ సాహితీ, సాహితీ స్రవంతి సంయుక్త నిర్వహణలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా ఇంట్లో రంగఖూని అనే ప్రేమ్‌చంద్ నవల చదివిన తర్వాత దానికి బానిసనయ్యాను. అందులోని పాత్రలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 30 ఏళ్ల కిందటే నాకు కులమతాల కోసం తెలిసి ఉంటే నా పేరును సుద్దాల అశోక్ శూద్ర తేజ అని పెట్టుకునేవాడిని’ అని అన్నారు. పేరు పక్కన శూద్ర అని పెట్టుకుంటే కులమతాల అడ్డుగోడలు తొలగిపోతాయన్నారు. సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కవిని, కావ్య పరిచయాన్ని శ్రీకాకుళ సాహితీ ప్రతినిధి అట్టాడ అప్పలనాయుడు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు శ్రీకాకుళం సాహిత్య చరి త్రలో ఇది ఒక సువర్ణ ఘట్టమని తెలిపారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ శూద్రగంగ కావ్యగానం చేశారు. అనంతరం ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.ఉదయ్‌కిరణ్, కంచరాన భుజంగరావు, చీకటి దివాకర్, కారసాల శ్రీనివాసరావు, కల్లేపల్లి రామ్‌గోపాల్, ఎస్.రుద్రమరాణి, బాడాన శ్యామలరావు పాల్గొన్నారు.