మాతా శిశు మరణాలు తగ్గాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మాతా శిశు మరణాల రేటు తగ్గాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 4 నెలల్లో జరిగిన 12 శిశు మరణాలపై ఆరా తీశారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఎంహెచ్‌ఓ కె.అనిత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రాందాస్, డీపీహెచ్‌ఎన్‌ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.


